Aadi Sai Kumar: యూత్‌ని ఆకట్టుకునేలా ఉన్న ‘అతిథి దేవోభవ’ మెలోడీ

27 Sep, 2021 16:56 IST|Sakshi

టాలీవుడ్‌ యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న కొత్త చిత్రం ‘అతిథి దేవోభవ’. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రాజాబాబు, అశోక్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నువేక్ష నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌.

‘బాగుంటుంది నువ్వు నవ్వితే.. బాగుంటుంది ఊసులాడితే’ అనే పల్లవితో సాగే ఈ మెలోడీ వినసొంపుగా ఉంది. భాస్కరభట్ల అందించిన లిరిక్స్ ఆకట్టుకోగా, సిద్ శ్రీరామ్, నూతన మోహన్ వాయిస్‌ దానికి అదనపు ఆకర్షణని తెచ్చింది.  ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రాగా ఈ లిరికల్ వీడియో సైతం యూత్‌ను విశేషంగా ఆకట్టుకునేలా ఉంది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ ఇప్పటికే పూర్తయ్యింది. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.

చదవండి: క్రైమ్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌తో `కిరాత‌క’, రెగ్యుల‌ర్ షూటింగ్‌ ఎప్పుడంటే..

మరిన్ని వార్తలు