35 మంది కొత్తవారితో ‘మేమ్‌ ఫేమస్‌’

14 May, 2023 06:03 IST|Sakshi
సార్య, సుమంత్‌ ప్రభాస్, శరత్‌ చంద్ర, చంద్రు మనోహర్, అనురాగ్‌

సుమంత్‌ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, నరేంద్ర రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మేమ్‌ ఫేమస్‌’. సుమంత్‌ ప్రభాస్‌ దర్శకత్వంలో ఛాయ్‌  బిస్కెట్, లహరి ఫిలింస్‌ పతాకాలపై శరత్‌ చంద్ర, అనురాగ్‌ రెడ్డి, చంద్రు మనోహర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ సినిమా టీజర్, ‘అయ్యయయ్యో..’ పాటను ప్రదర్శించారు.

అనంతరం ఈ చిత్ర హీరో, దర్శకుడు సుమంత్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ప్రమోషన్స్‌కు ప్రముఖ హీరోలంతా హెల్ప్‌ చేస్తుండటంతో నాకు మంచి పేరు వచ్చింది. అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘18 ఏళ్ళకే టిక్‌ టాక్‌లు చేసిన సుమంత్‌ 23 ఏళ్ళకే డెరైక్టర్‌ అయ్యాడు. అంతా యూత్‌ చేసిన సినిమా ఇది. ఆడియన్స్‌కు నచ్చుతుంది’’ అన్నారు అనురాగ్‌ రెడ్డి.

‘‘ఈ సినిమాతో 30 మందికిపైగా నటీనటులను పరిచయం చేయడం గర్వంగా వుంది’’ అన్నారు ‘లహరి ఫిలింస్‌’ చంద్రు మనోహర్‌. ‘‘వైజాగ్‌లో అన్నపూర్ణ స్టూడియోస్, రెండు రాష్ట్రాల్లో మిగిలిన ప్రాంతాల్లో గీతా ఆర్ట్స్, ఓవర్‌సీస్‌లో సరిగమల ద్వారా మా సినిమా విడుదలవుతుంది’’ అన్నారు శరత్‌ చంద్ర.

మరిన్ని వార్తలు