Merise Merise: థియేటర్లలో మెరిసే మెరిసే, అప్పుడే రిలీజ్‌!

18 Jul, 2021 10:34 IST|Sakshi

పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న విడుదలవుతున్న 'మెరిసే మెరిసే'

Dinesh Tej Movie Merise Merise: 'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'మెరిసే మెరిసే'. పవన్ కుమార్ కె. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొత్తూరి ఎంటర్టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై వెంకటేష్ కొత్తూరి నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మెరిసే మెరిసే' చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్ కె మాట్లాడుతూ.. 'నిర్మాత వెంకటేష్ కొత్తూరి సహకారంతో మెరిసే మెరిసే సినిమాను అనుకున్నట్లుగా తెరకెక్కించాం. ఇటీవలే సెన్సార్ వారు మా సినిమా చూసి అభినందించారు. క్లీన్ 'యూ' సర్టిఫికెట్ ఇచ్చారు. ఆగస్టు 6న మీ ముందుకొస్తున్నాం. మా సినిమా పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో కూడా ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ మెరిసే మెరిసేను హిట్ చేస్తారని ఆశిస్తున్నాం' అన్నారు.

మరిన్ని వార్తలు