గ్యాప్‌ వద్దనుకున్నా వస్తోంది!: మేర్లపాక గాంధీ

30 May, 2021 08:25 IST|Sakshi

ఓ మ్యాగజైన్‌ చదువుతున్నప్పుడు అందులో ఓ పాఠకుడు పంపిన ప్రశ్న నుంచి ఏక్‌ మినీ కథ ఆలోచన వచ్చింది. నా ఆలోచనని మా నాన్న మేర్లపాక మురళి, మా అంకుల్‌ మహర్షికి చెప్పినప్పుడు భయపడ్డారు. పూర్తి కథ రాశాక హ్యాపీగా ఫీలయ్యారు అని డైరెక్టర్‌ మేర్లపాక గాంధీ అన్నారు. సంతోష్‌ శోభన్‌, కావ్యా థాపర్‌ జంటగా కార్తీక్‌ రాపోలు దర్శకత్వం వహించిన చిత్రం ఏక్‌ మినీ కథ. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ రాజా, కృష్ణార్జున యుద్ధం వంటి హిట్‌ చిత్రాలకు దర్శకత్వం అందించిన మేర్లపాక గాంధీ ఏక్‌ మినీ కథకు కథ అందించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్‌, మ్యాంగో మాస్‌ మీడియా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది.

ఈ సందర్భంగా మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. నా గత చిత్రాలు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ రాజా వినోదాత్మకంగా ఉంటాయి. వినోదాత్మక చిత్రాలకు థియేటర్లలో అయితే ఆ అనుభూతే వేరు. ఏక్‌ మినీ కథలో ఫన్‌ బాగా వర్కవుట్‌ అవుతుందనుకున్నాం. అందుకే ముందు ఓటీటీ కోసం స్టార్ట్‌ చేసినా, థియేటర్స్‌ అయితే మంచి అనుభూతి ఉంటుందనిపించింది. అయితే సెకండ్‌ వేవ్‌ వల్ల ఓటీటీకి వెళ్లాల్సి వచ్చింది. నా దర్శకత్వంలోనే ఈ సినిమా చేయాలనుకున్నాం. గత ఏడాది లాక్‌డౌన్‌కు ముందు నితిన్‌తో నా డైరెక్షన్‌లో మాస్ట్రో సినిమా స్టార్ట్‌ అయింది.

ఈ లోపు లాక్‌డౌన్‌ వచ్చేసింది. లాక్‌డౌన్‌ ముగియగానే మాస్ట్రో చేయాలి. ఒకే సమయంలో రెండు సినిమాలు చేయలేం కదా? అందుకే కార్తీక్‌తో దర్శకత్వం చేయించమని యూవీ క్రియేషన్స్‌ వారికి చెప్పా. వారికి కథ నచ్చి నిర్మించారు. నితిన్‌తో చేస్తున్న మాస్ట్రో షూటింగ్‌ వారం మాత్రమే మిగిలి ఉంది. అనుకున్నట్లు అయ్యుంటే జూన్‌ 11న సినిమాను విడుదల చేసేవాళ్లం. మాస్ట్రో తర్వాత గ్యాప్‌ లేకుండా సినిమాలు చేద్దామనుకుంటున్నాను. ప్రతిసారీ గ్యాప్‌ తీసుకోకూడదనుకుంటాను కానీ గ్యాప్‌ వస్తోంది(నవ్వుతూ) అన్నారు మేర్లపాక గాంధీ.

చదవండి: సీఎం కొడుకుతో మూవీ ఛాన్స్‌ కొట్టేసిన శివానీ రాజశేఖర్‌

‘ఏక్ మినీ క‌థ‌’ మూవీ రివ్యూ

మరిన్ని వార్తలు