‘లెహరాయి’ నుంచి సిద్‌ శ్రీరామ్‌ పాడిన పాట విడుదల

18 Jun, 2022 09:12 IST|Sakshi

రంజిత్, సౌమ్యా మీనన్‌ జంటగా రామకృష్ణ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లెహరాయి’. నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ సమర్పణలో ఎస్‌ఎల్‌ఎస్‌ మూవీస్‌పై మద్దిరెడ్డి శ్రీనివాస్‌ నిర్మించారు. ఈ చిత్రంలోని ‘మెరుపై మెరిసావే.. వరమై కలిసావే.. గుండె గిల్లి వెల్లావే..’ అంటూ సాగే రెండో పాటను దర్శకుడు శివ నిర్వాణ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీకే (ఘంటాడి కృష్ణ)గారి పాటలను అప్పట్లో యూత్‌ అంతా పాడుకునేవారు. చాలా రోజుల తర్వాత ఆయన ‘లెహరాయి’ ద్వారా మళ్లీ రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘మెరుపై మెరిసావే..’ కి జీకేగారు మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. ఈ పాటను సిధ్‌ శ్రీరామ్‌ పాడటం మొదటి సక్సెస్‌గా భావిస్తున్నాను. సినిమాని త్వరలో రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు మద్దిరెడ్డి శ్రీనివాస్‌. ‘‘మంచి ఫీల్‌ ఉన్న కథా చిత్రమిది’’ అన్నారు రామకృష్ణ పరమహంస. 

మరిన్ని వార్తలు