ఆసక్తి రేపుతున్న ‘మైకెల్‌’ట్రైలర్‌

14 May, 2021 18:23 IST|Sakshi

సాయి చరణ్ తేజ్ , ఆదిత్య శివ, శేఖర్ జిఎంఎస్, చిరంజీవి, మారుతీ సాకారం, మణిరాజ్, పవన్.జి, చిన్న నరసింహులు, అవినాష్  ప్రధాన పాత్రలలో  యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌ గా  రూపొందుతున్న చిత్రం  ‘మైకెల్’.  ఈ చిత్రానికి కిరణ్  దర్శకత్వం వహిస్తున్నారు. వన్ మీడియా బ్యానర్ పై పార్ధు రెడ్డి  నిర్మిస్తున్నారు.  నవీన్ ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రవీణ్ కుమార్ అడిషనల్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందించారు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది..  ఇటీవలే విడుదలైన చిత్రం ఫస్ట్ లుక్  మంచి రెస్పాన్స్  రాగా శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పార్థు రెడ్డి మాట్లాడుతూ..  ‘సినిమాను చూశాను చాలా బాగా వచ్చింది. దర్శకుడు చెప్పిన దానికన్నా చాలా బాగా సినిమా ని తెరకెక్కించాడు. అందరు కొత్తవాళ్లే అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న నటుల్లా నటించారు.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న మా సినిమాను త్వరలోనే విడుదల చేస్తాం’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు