సర్వస్వం నువ్వే.. లవ్‌ యూ: మిహికా

15 Aug, 2020 14:03 IST|Sakshi

భర్తతో కలిసి ఉన్న ఫొటోలు షేర్‌ చేసిన మిహికా బజాజ్‌

‘‘నా ప్రేమ, నా జీవితం, నా హృదయం, నా ఆత్మ! నా సర్వస్వం నువ్వే. నేనెప్పుడూ కలలో కూడా ఇది ఊహించలేదు!! నన్ను మరింత మెరుగైన వ్యక్తిగా మలిచావు. ఐ లవ్‌ యూ!’’ అంటూ మిహికా బజాజ్‌ తన భర్త రానా దగ్గుబాటిపై ప్రేమను చాటుకున్నారు. తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు షేర్‌ చేస్తూ ఈ మేరకు భావోద్వేగ క్యాప్షన్‌ జతచేశారు. కాగా ప్రేమజంట రానా- మిహికాల పెళ్లి గత శనివారం హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాలు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వైభవోపేతంగా ఈ శుభకార్యాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నవ వధువు మిహికా తాజాగా తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్‌ చేశారు. (కుటుంబంలోకి స్వాగతం మిహికా: సమంత)

భర్త రానా, సోదరుడు సమర్థ్‌ బజాజ్‌తో పాటు తల్లిదండ్రులతో తనకు ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఉన్న కొన్ని మూమెంట్స్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో మరోసారి రానా- మిహికాల పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా రామానాయుడు స్టూడియోలో వివాహం జరిగిన అనంతరం నవ దంపతులు వ్రతం ఆచరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో సెలబ్రిటీ కపుల్‌, రానా కజిన్‌ నాగచైతన్య- సమంత దంపతులు చేసిన సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్తజంటతో పాటు వారికి సంబంధించిన ప్రతీ వేడుకలోనూ చై-సామ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.(రానా పెళ్లిలో చైతూ చిలిపి ప‌ని)


డాడీస్‌ గర్ల్‌ మిహికా

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా