సిగరెట్‌కు బానిసగా మారాను, కానీ..: నటుడు

1 Jun, 2021 20:32 IST|Sakshi

50 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఫిట్‌గా ఉంటూ యంగ్‌ హీరోలకే సవాళ్లు విసిరే నటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఆ లిస్టులో బాలీవుడ్‌ నటుడు మిలింద్‌ సోమన్‌ ముందు వరుసలో ఉంటాడు. తాజాగా అతడు తనకు గతంలో ఉన్న చెడు అలవాటు గురించి వెల్లడించాడు. "పొగాకు ప్రతి యేటా ప్రపంచంలోని ఎనభై లక్షల మంది ప్రాణాలను హరిస్తోంది. మే 31న జరుపుకునే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నాకు ఎప్పుడూ ఒకటి గుర్తు చేస్తూ ఉంటుంది"

"32 ఏళ్ల వయసులో కెప్టెన్‌ వ్యోమ్‌ సిరీస్‌ చేస్తున్నప్పుడు సిగరెట్లు తాగడం బాగా అలవాటైంది. రోజుకు 20 నుంచి 30 సిగరెట్లు కాల్చేవాడిని. చాలా తక్కువ కాలంలోనే పొగాకుకు బానిసనయ్యాను. కానీ అదృష్టవవాత్తూ దానివల్ల నాకు ఎటువంటి మేలు జరగదని తెలుసుకుని పొగ తాగడం మానేసాను" అని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టిన అతడు సిగరెట్‌ను ముక్కలు చేసిన వీడియోను రిలీజ్‌ చేశాడు. ఇది చూసిన అభిమానులు ఒకప్పుడు పొగాకుకు బానిసగా మారి దాన్ని త్యజించడం అంటే అంత మామూలు విషయం కాదని కామెంట్లు చేస్తున్నారు.

A post shared by Milind Usha Soman (@milindrunning)

చదవండి: సెల్ఫీ అడిగిన మహిళతో పుషప్‌లు.. నటుడిపై నెటిజన్లు ఫైర్‌

మరిన్ని వార్తలు