విభిన్న లుక్‌లో మిలింద్‌ సోమన్‌!

10 Nov, 2020 19:46 IST|Sakshi

ముంబై : నటుడు, మోడల్‌ మిలింద్‌ సోమన్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తాడు. ఈ క్రమంలో మంగళవారం ఓ అద్భుతమైన ఫొటోను షేర్‌ చేశాడు. ముఖానికి సగం వరకు ఎరుపు రంగు పులుముకొని, పెద్ద ముక్కు పుడక, కళ్లకు కాటుకతో విభిన్న లుక్‌లో కనిపించాడు. ‘‘-మంగళవారం ప్రయాణం! ఇది హోళీ పండుగ సమయం కాదని నాకు తెలుసు. అయితే నేను గత కొన్ని రోజులుగా ముంబై సమీపంలోని కర్జాత్‌లో కొన్ని సరదా పనులు చేస్తూ ఉన్నా. వాటినే ఇలా మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు నేను చెన్నై వెళ్తున్నా’’  అని క్యాప్షన్‌ జతచేశాడు. ఇక మిలింద్‌ సరికొత్త లుక్‌పై స్పందించిన నెటిజన్లు.. అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘లక్ష్మి’(కాంచన రీమేక్‌) సినిమాలోని ఫోటోలా ఉందని, ఇందులో మీరు నటించారా లేదా ఆ క్యార్టెర్‌పై ఉన్న ఇష్టంతో ఇలాంటి ఫొటో తీసుకున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా కొత్త లుక్‌ బాగుంది అంటూ కామెంట్‌ చేస్తున్నారు. కాగా ఆయన సతీమణి అంకితా కొన్వర్‌ సైతం ఈ ఫొటో అద్భుతంగా ఉంది అని భర్తపై ప్రేమను చాటుకున్నారు.(చదవండి: బూడిద పూసుకొని నగ్నంగా తిరిగితే తప్పు లేదా..)

కాగా ఇటీవల గోవా బీచ్‌లో మిలింద్‌ నగ్నంగా పరుగెడుతున్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అంకితా కొన్వర్‌ తీసిన ఫోటోను ‘హ్యాపీ బర్త్‌డే టు మీ 55’ అనే కాప్షన్‌తో షేర్‌ చేయగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు గోవా సురక్షా మంచ్‌ అనే సంస్థ పబ్లిక్‌ ప్లేస్‌లో అసభ్యంగా ప్రవర్తించారంటూ మిలింద్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సమాచార సాంకేతిక చట్టంలోని ఇతర సంబంధిత సెక్షన్లతో పాటు, భారతీయ శిక్షాస్మృతిలోని  సెక్షన్‌ 294 కింద కేసు నమోదు చేసినట్లు గోవా సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ పంకజ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. ఇక, సినీ నటి పూనం పాండే గోవాలో అశ్లీల వీడియో చిత్రీకరించిందనే ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం.

Travel Tuesday! I know its not holi but spent the last few days in Karjat near Mumbai doing some fun things - will share more soon 😋 now off to Chennai!

A post shared by Milind Usha Soman (@milindrunning) on

మరిన్ని వార్తలు