రొమాంటిక్‌ ఫొటో: నాకిష్టమైన ప్రదేశం ఇదే..!

27 Feb, 2021 18:33 IST|Sakshi

ముంబై: ‘‘ఏడేళ్ల ప్రయాణంలో ప్రపంచమంతా చుట్టివచ్చాం. సముద్ర గర్భంలోకి వెళ్లాం. శిఖరాల అంచుల వరకు వెళ్లగలిగాం. దేశ విదేశాలను సందర్శించాం. అడవుల్లో విహరించాం. పడవల్లో తిరిగాం. ఎడారులు, అగ్నిపర్వతాలు.. ఇలా అన్నీ చూశాం కదా. మరి నాకిష్టమైన ప్రదేశం ఏమింటే.. ఇదిగో ఇక్కడే.. నీ బాహువుల్లో(చేతుల్లో) ఇలా ప్రశాంతంగా నిద్రపోవడం అంటే ఇష్టం... ఎప్పటికీ అంతంకాని మన ప్రేమకు.. ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నెన్నో’’ అంటూ నటుడు మిలింద్‌ సోమన్‌ తన భార్య అంకిత కొన్వార్‌పై ప్రేమను చాటుకున్నాడు. తమ ప్రేమ బంధానికి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఇన్‌స్టాలో సతీమణి ఆలింగనంలో సేదతీరుతున్న ఫొటో షేర్‌ చేసి ఈ మేరకు క్యాప్షన్‌ జతచేశాడు.

ఇక ఇందుకు స్పందనగా అంకిత సైతం భర్త మిలింద్‌ రాసిన వాక్యాల్లోని ప్రదేశాలను ప్రతిబింబించేలా ఆయా చోట్ల తాము దిగిన ఫొటోలు పోస్ట్‌ చేశారు. ఏడేళ్లు ఒక్క క్షణంలా గడిచిపోయాయి. ఈ జ్ఞాపకాలు కలకాలం ఇలాగే నిలిచిపోతాయి. నా ప్రేమమూర్తిగా ఉన్నందుకు థాంక్యూ’’ అంటూ ఎమోషనల్‌ అయ్యారు. దీంతో.. ‘‘మీ ఇద్దరి బంధం చిరకాలం ఇలాగే వర్ధిల్లాలలి’’అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఈ జంట ఒకరినొకరు తొలిసారిగా కలుసుకున్నారు. ఈ క్రమంలో 2018 ఏప్రిల్‌లో పెద్దల అంగీకారంతో పెళ్లితో ఒక్కటయ్యారు. కాగా వీరిద్దరి మధ్య 26 ఏళ్ల వ్యత్యాసం ఉండటంతో ట్రోలింగ్‌ బారినపడ్డారు.

కూతురు వయస్సున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని మిలింద్‌(55)పై, యువకుడు దొరకలేదా అంటూ అంకితపై కొంతమంది నెటిజన్లు విద్వేష విషం చిమ్మారు. కానీ ఇవేమీ పట్టించుకోమని, వయసు ఒక నంబర్‌ మాత్రమేనంటూ తేలికగ్గా కొట్టిపారేశారు ఈ లవబుల్‌ కపుల్‌. నిజమైన ప్రేమకు వయసుతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. నిజానికి మిలింద్‌ను కలవడానికి ముందు అంకిత ఓ వ్యక్తిని ప్రేమించారు. అయితే హఠాత్తుగా అతడు మరణించడంతో తీవ్రంగా కుంగిపోయారు. ఈ క్రమంలో చెన్నైలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్న సమయంలో మిలింద్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమ, ఆపై పరిణయం వరకు దారితీసింది. ఇక మిలింద్‌కు గతంలో ఫ్రెంచ్‌ మహిళ్లతో పెళ్లి కాగా ఇద్దరూ విడిపోయారు. 

A post shared by Milind Usha Soman (@milindrunning)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు