కుమారుడ్ని హీరోగా చేయడం కోసమేనా?

5 Jul, 2021 16:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తన కుమారుడు నయన్‌తో కలిసి మెగాస్టార్‌ చిరంజీవి, జూ. ఎన్టీఆర్‌లను కలిశారు. తొలుత ఎన్టీఆర్‌ను కలిసిన అజయ్‌ కుమార్‌, నయన్‌లు.. ఆపై చిరంజీవిని కలిశారు. నయన్‌ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి అతనితో స్వయంగా కేక్‌ కట్‌ చేయించారు. దీనికి సంబంధించిన ఫోటోలను మంత్రి పువ్వాడ అజయ్‌ పోస్ట్‌ చేశారు. అయితే అకస్మాత్తుగా మంత్రి పువ్వాడ వరసగా సినీ ప్రముఖులు చిరంజీవి, ఎన్టీఆర్‌లను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పువ్వాడ నయన్‌ను సినిమాల్లోకి తీసుకొస్తున్నారా అంటూ కొందరు నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే టాలీవుడ్‌లో నయన్‌ ఎంట్రీ ఉండబోతుందంటూ అప్పుడే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.

మరోవైపు మంత్రి కేటీఆర్‌ను కూడా కలిశారు. 'నేడు నా తనయుడు Dr. పువ్వాడ నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా రామన్న కుటుంబాన్ని మర్యాపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడమైంది' అంటూ మంత్రి పువ్వాడ అజయ్‌ ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ దంపతులు నయన్‌కు బర్త్‌డే విషెస్‌ అందజేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు