Pakistan OTT Banned: పాకిస్థాన్ ఓటీటీపై నిషేధం.. ఎందుకంటే?

13 Dec, 2022 17:41 IST|Sakshi

పాకిస్థాన్‌కు చెందిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్‌కు చెందిన 'విడ్లీ టీవీ' అనే ఓటీటీ ఫ్లామ్‌ఫామ్‌ను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు మరో రెండు మొబైల్ అప్లికేషన్లు, నాలుగు సోషల్ మీడియా ఖాతాలు, స్మార్ట్ టీవీ యాప్‌లపై కూడా నిషేధం విధించింది. 

ఇటీవల విడ్లీ టీవీ ఓటీటీలో విడుదలైన 'సేవక్:‍ ది కన్ఫెషన్స్' ‍అనే వెబ్‌ సిరీస్‌లో భారతదేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పు తెచ్చేలా కంటెంట్ ఉందని కేంద్రం వెల్లడించింది. ఓటీటీలో విడుదలైన మూడు ఎపిసోడ్‌లు దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది. వెబ్‌ సిరీస్‌లో ప్రసారమవుతున్న కంటెంట్ భారత చారిత్రక ఘటనలపై వ్యతిరేకతను పెంచేలా ఉందని.. పూర్తి అవాస్తవాలతో ప్రసారం చేస్తున్నారని భారత సీనియర్ అధికారి కంచన్‌ గుప్తా తన ట్విటర్‌లో వెల్లడించారు. 

మరిన్ని వార్తలు