జైలర్‌ 2 గురించి గుడ్‌న్యూస్‌ చెప్పిన నటి

24 Feb, 2024 06:51 IST|Sakshi

రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన జైలర్‌ చిత్రం ఈ మధ్య విడుదలై సంచలన విషయాన్ని సాధించిన విషయం తెలిసిందే. నటి తమన్నా కీలక పాత్రను పోషించిన ఈ చిత్రాన్ని నెల్సన్‌ తెరకెక్కించారన్నది విదితమే. రూ.600 కోట్లు కొల్లగొట్టిన చిత్రం జైలర్‌. దీనికి సీక్వెల్‌ రూపొందనుందన్న విషయం చాలాకాలంగా జరుగుతోంది. దాన్ని ఇప్పుడు నటి మిర్నా మీనన్ ఖరారు చేశారు. ఈమె జైలర్‌ చిత్రంలో రజనీకాంత్‌కు కోడలుగా నటించారన్నది గమనార్హం.

జైలర్‌ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందన్న విషయాన్ని ఈమె స్పష్టం చేశారు. దీని గురించి నటి మిర్ణా తెలుపుతూ తాను దర్శకుడు నెల్సన్‌తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటానని చెప్పారు. జైలర్‌ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని తనతో చెప్పారన్నారు. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన కథను రెడీ చేస్తున్నట్లు చెప్పారన్నారు. అయితే దానికి సీక్వెల్‌లో తాను నటిస్తానో, లేదో తెలియదు అన్నారు.

దీంతో జైలర్‌ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందన్న విషయం స్పష్టం అయ్యింది. నటుడు రజనీకాంత్‌ ప్రస్తుతం వేట్టైయాన్‌ చిత్రంలో నటిస్తున్నారు. దీని షూటింగ్‌ సగానికి పైగా పూర్తి అయ్యిందని సమాచారం. తర్వాత తన 171వ చిత్రాన్ని లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో చేస్తున్నట్లు సమాచారం. జైలర్‌–2 సెట్‌ పైకి వెళ్లడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఇది రజనీకాంత్‌ నటించే 172వ చిత్రం అవుతుంది.

whatsapp channel

మరిన్ని వార్తలు