Mirzapur Actor Passed Away: తీవ్ర విషాదం.. మీర్జాపూర్‌ నటుడు మృతి

15 Oct, 2022 18:17 IST|Sakshi

సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు జితేంద్ర శాస్త్రి మృతి చెందారు. ఆయన మరణించినట్లు ప్రముఖ నటుడు సంజయ్‌ మిశ్రా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా జితేంద్ర శాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఆయన మృతికి గల కారణాలను ఆయన వెల్లడించలేదు. వృద్ధాప్య సమస్యలతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంజయ్‌ మిశ్రా ట్వీట్‌ చేస్తూ.. ‘‘జీతూ భాయ్‌ మీరు నాతో ఓ మాట చెప్పారు. ‘సంజయ్‌ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఫోన్‌ వ్యక్తి పేరు ఉంటుంది.

చదవండి: సొంతవాళ్లే మోసం చేశారు, నటి వల్ల రూ. 6 కోట్లు నష్టపోయా: గీతా సింగ్‌

కానీ, ఆ మనిషి నెట్‌వర్క్‌ పరిధిలో ఉండడు’ అన్నారు. చెప్పినట్టుగానే మీరు ఈ ప్రపంచాన్ని(నెట్‌వర్క్‌) వీడారు. కానీ మా మనసుల్లో, ఆలోచనలో ఎప్పుడు ఉంటారు. ఓం శాంతి’’ అంటూ ఆయనతో ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. ఇక ఆయన మరణావార్తమ తెలిసి బాలీవుడ్‌ సినీ, టీవీ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా జితేంద్ర శాస్త్రి బ్లాక్‌ ఫ్రైడే, ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌, రాజ్మా చావ్లా వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. అలాగే ఓటీటీలో అంత్యంత ఆదరణ పొందిన మీర్జాపూర్‌ వెబ్‌ సిరీస్‌లో కూడా ఆయన నటించారు. ఇందులో ఆయన ఉస్మాన్‌ అనే ప్రధాన పాత్ర పోషించారు. 

A post shared by Sanjay Mishra (@imsanjaimishra)

మరిన్ని వార్తలు