మీర్జాపూర్‌ 2: ఫ్యాన్స్‌ అసంతృప్తి

23 Oct, 2020 10:01 IST|Sakshi

మొదటి సీజన్‌తో విపరీతమైన ప్రేక్షకాదరణ పొందిన వెబ్‌ సిరీస్‌ ‘‘మీర్జాపూర్‌’. గ్యాంగ్‌ వార్‌ నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ కథ ఇది. శుక్రవారం అమెజాన్‌ ప్రైమ్‌లో సీజన్‌ 2 మొదలైంది. తాజగా విడుదలైన సీజన్‌2లోని రెండు ఎపిసోడ్లపై సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు స్పందిస్తున్నారు. మొదటి సీజన్‌తో పోల్చుకుంటే రెండో సీజన్‌ కొద్దిగా బాగోలేదని అంటున్నారు. హింస మరింత పెరిగిందని, ఎవర్ని ఎవరు చంపుతున్నారో క్లారిటీ లేదని వాపోతున్నారు. అయితే కొత్తగా సీజన్‌లోకి ప్రవేశించిన నటీనటులు విజయ్‌ వర్మ, ప్రియన్షూ పేన్యూలీ, ఇషా తల్వార్‌ నటన అద్భుతంగా ఉందంటున్నారు. ( హ్యపీ బర్త్‌డే డార్లింగ్‌ ప్రభాస్‌..)

అలీ ఫజల్‌, పంకజ్‌ త్రిపాఠి, దివ్యేందు శర్మ, శ్వేత త్రిపాఠి, హర్షితా శేఖర్‌, అమిత్‌ సియాల్‌, విజయ్‌ వర్మ, ప్రియన్షూ పేన్యూలీ, ఇషా తల్వార్‌లు కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌కు కరణ్‌ అన్షుమన్‌, గుర్మీత్‌ సింగ్‌లు దర్శకత్వం వహించారు. ఎక్సెల్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఫర్హాన్ అక్తర్, రితేశ్‌ సిద్వానీ దీన్ని నిర్మించారు. మొదటి సీజన్‌కు కూడా మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికి అభిమానుల ప్రోత్సాహంతో ముందుకు దూసుకుపోయింది.

మరిన్ని వార్తలు