కీర్తి సురేశ్‌ కన్నా నేను అందంగా ఉన్నానట!

17 Feb, 2021 13:24 IST|Sakshi

అధిక బరువు అనేది శారీరక సమస్యగా కనిపిస్తుంది. కానీ అది మనసును అనుక్షణం తొలిచివేస్తూ మానసిక రుగ్మతకు కూడా దారి తీస్తుంది. అయితే సినిమా వాళ్లు మాత్రం పాత్రకు తగ్గట్లు బరువు పెరుగుతుంటారు, తగ్గుతుంటారు. మహానటి కీర్తి సురేశ్‌ కూడా మిస్‌ ఇండియా చిత్రం కోసం బరువు తగ్గిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ అధిక బరువుతో బాధపడ్డ ఆమె సోదరి రేవతి సురేశ్‌ కోసం చెప్పుకుని తీరాల్సిందే.

రేవతి కాస్త లావుగా ఉండటం వల్ల అందరూ ఆమెను అదోలా చూసేవారు. తల్లి, చెల్లి ఎలా ఉన్నారు, నువ్వెలా ఉన్నావంటూ వెటకారంగా మాట్లాడేవారు. వాటన్నింటినీ మౌనంగా భరిస్తూ వచ్చిన రేవతి చివరకు బరువు తగ్గి సమాధానం చెప్పింది. "నా బరువు వల్ల ఎన్నో బాధలు అనుభవించాను. అమ్మ, చెల్లితో నన్ను పోలుస్తూ ఎగతాళి చేసేవారు. దానివల్ల నామీద నాకు నమ్మకం పోయింది. నేను వాళ్లలా అందంగా లేనని, నాలో ఏదో లోపముందని ఫీలయ్యేదాన్ని. జనాలు కూడా దాన్ని నేను బలంగా నమ్మేలా చేశారు. ఎంతలా అంటే, నా భర్త ప్రపోజ్‌ చేసినప్పుడు కూడా నాలో ఏముందని నన్ను ప్రేమించాడు అని భావించేంతలా.."

A post shared by Revathy Sureshkumar (@revathysureshofficial)

"ఒకావిడైతే మీ అమ్మ, చెల్లి అంత బాగున్నారు, నీకేమైంది ఇలా ఉన్నావు అని ముఖం పట్టుకుని అనేసింది. అద్దం ముందు నిలబడి నాలో ఏం లోపం ఉందని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఎందుకు నేను అందంగా లేనని అంతరంగాన్ని నిలదీశాను. ఒకానొక సమయంలో నన్ను నేను అసహ్యించుకున్నాను కూడా. సంతోషం అనేది నా దరిదాపుల్లోకి కూడా రాదనుకున్నాను. కానీ నా సోదరి నాకు అండగా నిలబడి నా బరువు గురించి ఎవరేం మాట్లాడినా తిప్పి కొట్టేది. తన కంటే నేనే అందంగా ఉన్నానని కీర్తి స్నేహితులు అన్నారని చెప్పగానే ఆ జోక్‌కు పెద్దగా నవ్వేశాను" అని చెప్పుకొచ్చింది. బరువు తగ్గడానికి ముందు, తర్వాత ఫొటోలను ఈ పోస్ట్‌కు జత చేసింది. ఈ ఫొటో చూసిన కీర్తి అభిమానులు రెండింటిలోనూ అందంగానే ఉన్నారంటున్నారు.

చదవండి: ద‌ర్శ‌కుడి వెంట‌ప‌డి చిత‌క‌బాదిన హీరోయిన్‌

సీఎం కేసీఆర్‌కు ఇచ్చే గిఫ్ట్‌ ఇదే : చిరంజీవి

రఘుబాబు కూతురి ఎంగేజ్‌మెంట్‌లో స్టార్ల సందడి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు