ప్రేక్షకుల వల్లే అది సాధ్యమైంది

18 Sep, 2023 04:50 IST|Sakshi

– నవీన్  పొలిశెట్టి

‘‘మిస్‌శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ విడుదల రోజే ఓ పెద్ద హిందీ సినిమా(జవాన్‌) రిలీజ్‌ అవుతోందని తెలినప్పుడు ఆందోళన చెందాం. కానీ ఈ నెల 7 నుంచి మొదలైన ప్రీమియర్స్‌ నుంచి ఇప్పటి వరకూ మా సినిమాకు మంచి స్పందన లభిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకుల మౌత్‌టాక్‌తోనే ఇది సాధ్య మైంది.. మాకు పెద్ద హిట్‌ ఇచ్చిన వారికి ధన్యవాదాలు’’ అని హీరో నవీన్  పొలిశెట్టి అన్నారు. అనుష్కా శెట్టి, నవీన్  పొలిశెట్టి జంటగా పి.మహేశ్‌బాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్‌శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’.

వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైంది. ఈ సినిమా విజయోత్సవంలో నవీన్  మాట్లాడుతూ– ‘‘మా సినిమాను అందరికంటే ముందు చూసిన చిరంజీవిగారు హిట్‌ అవుతుందన్నారు.. ఆయన మాటే నిజం అయింది’’ అన్నారు. ‘‘నాకు వచ్చిన ఓ ఐడియాను నవీన్ , అనుష్కలతో పాటు నిర్మాతలు నమ్మకుంటే ఈ సినిమా ఇంత సక్సెస్‌ అయ్యేది కాదు’’ అన్నారు పి.మహేశ్‌బాబు. దర్శకులు మారుతి, నాగ్‌ అశ్విన్, అనుదీప్‌ కేవీ, నందినీ రెడ్డి, బుచ్చిబాబు, మేర్లపాక గాంధీ, ప్రొడ్యూసర్స్‌ అభిషేక్‌ అగర్వాల్, ఎస్‌ఎకేఎన్‌ మాట్లాడారు.

మరిన్ని వార్తలు