MissShetty Mr Polishetty OTT: అనుష్క 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' ఓటీటీ అఫిషియల్‌ ప్రకటన వచ్చేసింది

30 Sep, 2023 14:07 IST|Sakshi

అనుష్క చాలా కాలం తర్వాత చేసిన సినిమా 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' సినిమాతో వెండితెరపై మెరిసింది. ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పి.మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించగా నాజర్‌, మురళీ శర్మ, జయసుధ, అభినవ్‌ గోమఠం, సోనియా దీప్తి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా పాజిటీవ్‌ టాక్‌తో ఇప్పటి వరకు సుమారు రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టినట్లు సమాచారం.

(ఇదీ చదవండి: 'గేమ్‌ ఛేంజర్‌' ఎఫెక్ట్‌.. సూసైడ్‌ లేఖతో చరణ్‌ అభిమాని వార్నింగ్‌..)

తాజాగా మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి నుంచి ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. అక్టోబర్‌ 5న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుందని అఫిషీయల్‌గా నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాకు తొలి ప్రేక్షకుడిని నేనే అంటూ గతంలో చిరంజీవి తెలిపారు. సినిమా చాలా అద్భుతంగా ఉందని ఆయన తెలిపిన విషయం తెలిసిందే. దీంతో సినిమాకు ప్రారంభం నుంచే పాజిటివ్‌ టాక్‌ రావడం మొదలైంది.

మెగాస్టార్‌తో పాటు మహేశ్‌ బాబు, సమంత కూడా ఈ సినిమాపై పాజిటివ్‌గానే రియాక్ట్‌ అయ్యారు. నవీన్‌ పొలిశెట్టి ‘జాతిరత్నాలు’ కంటే రెట్టింపు వినోదం ఇందులో ఉన్నట్లు వారందరూ తెలిపారు. థియేటర్లో ఈ సినిమా చూడలేకపోయిన వారు అక్టోబర్‌ 5న నెట్‌ఫ్లిక్స్‌ చూసి ఎంజాయ్‌ చేయండి.

మరిన్ని వార్తలు