ఆపరేషన్‌కి డేట్‌ ఫిక్స్‌

3 Nov, 2021 05:40 IST|Sakshi

‘‘ఆపరేషన్‌ని చూడ్డానికి రెడీగా ఉండండి’’ అంటున్నారు రష్మికా మందన్నా. ఏం ఆపరేషన్‌ అంటే.. భారతదేశానికి సంబంధించిన అతి పెద్ద సీక్రెట్‌ ఆపరేషన్‌ అన్నమాట. నాటి ఘటనను ఆధారంగా చేసుకుని సిద్ధార్థ్‌ మల్హోత్రా, రష్మికా మందన్నా జంటగా రూపొందిన చిత్రం ‘మిషన్‌ మజ్ను’. పాకిస్తాన్‌లో భారతదేశ గూఢచార సంస్థ నిర్వహించిన కోవర్ట్‌ ఆపరేషన్‌ నేపథ్యంలో శాంతను బగ్చీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల తేదీ ఫిక్స్‌ అయింది. ‘‘వచ్చే ఏడాది మే 13న సినిమాని విడుదల చేస్తున్నాం. వాస్తవ ఘటనల స్ఫూర్తిగా తీసిన సినిమా ఇది’’ అని విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ప్రస్తుతం హిందీలో మూడు సినిమాలు చేస్తున్నారు రష్మిక. ‘మిషన్‌ మజ్ను’తో హిందీ తెరపై రష్మిక తొలి అడుగు వేయనున్నారు. 

మరిన్ని వార్తలు