మిథున్‌ చక్రవర్తి ప్రేయసిగా శ్రుతీహాసన్‌

16 Jan, 2021 12:46 IST|Sakshi

శ్రుతీహాసన్, మిథున్‌ చక్రవర్తి ముఖ్య పాత్రల్లో హిందీలో ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కనుంది. ‘ది బెస్ట్‌ సెల్లర్‌ షీ రోట్‌’ అనే నవల ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. దీనిని అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయనున్నారు. ఓ సూపర్‌ స్టార్‌ నవలా రచయితకూ, అతని ప్రేయసికీ మధ్య జరిగే కథే ఈ నవల. ఇందులో సూపర్‌స్టార్‌ నవలా రచయితగా మిథున్‌ చక్రవర్తి, అతని ప్రేయసిగా శ్రుతి కనిపిస్తారని టాక్‌. మనోజ్‌ బాజ్‌పాయ్‌ నటించిన హిందీ చిత్రం ‘మిస్సింగ్‌’ని తెరకెక్కించిన ముకుల్‌ అభ్యంకర్‌ ఈ సిరీస్‌ను డైరెక్ట్‌ చేయనున్నారు. సిద్ధార్థ్‌ పి. మల్హోత్రా నిర్మాత. ఉత్తరాఖండ్‌లో చిత్రీకరణ జరగనున్న ఈ సిరీస్‌ను ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయాలనుకుంటున్నారు. చదవండి: సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది అదే

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు