పెళ్లి చేసుకున్న సునీల్ హీరోయిన్

13 Sep, 2020 19:44 IST|Sakshi

కొచ్చి: మ‌ల‌యాళ న‌టి మియా జార్జ్ ఇప్పుడు శ్రీమ‌తి మియాగా మారారు. ఆమె వ్యాపార‌వేత్త అశ్విన్ ఫిలిప్‌ను వివాహం చేసుకున్నారు. శ‌నివారం కేర‌ళ‌లోని కొచ్చిలో జ‌రిగిన వీరి పెళ్లి వేడుకకు అతి కొద్ది మంది అతిథులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. కాగా కేర‌ళ‌లోని పాలాలో జూన్‌లో వీరి నిశ్చితార్థం జ‌రిగింది.  ఈ సంద‌ర్భంగా మియా అశ్విన్‌తో క‌లిసి దిగిన ఫొటోను సైతం అభిమానుల‌తో పంచుకున్నారు. ఆ త‌ర్వాత ఆగ‌స్టులో డ్రీమ్ వెడ్డింగ్ జ‌రుపుకున్నారు. (చ‌ద‌వండి: ప్రసాదు.. మీ పెళ్లెప్పుడు..?!)

❤ Our dream Betrothal was held at Palai with the artistic help of @labelmdesigners Reception decor & arrangements by team @labelmsignatureweddings_ Photos by @studio360byplanj

A post shared by miya (@meet_miya) on

తాజాగా సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా కుటుంబ స‌భ్యుల మ‌ధ్యంగా అధికారికంగా వివాహం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ కొత్త జంట పెళ్లి ఫొటోలు  సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. టీవీ న‌టిగా కెరీర్ ప్రారంభించిన మియా త‌ర్వాత ప‌లు సినిమాల్లో న‌టించి గుర్తింపు సంపాదించుకున్నారు. 'అమ‌ర కావ్యం' అనే రొమాంటిక్ డ్రామా చిత్రంతో త‌మిళ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టారు. ఆమె తెలుగులో సునీల్ స‌ర‌స‌న 'ఉంగ‌రాల రాంబాబు' చిత్రంలో న‌టించారు. ప్ర‌స్తుతం హీరో విక్ర‌మ్ 'కోబ్రా' చిత్రంలోనూ క‌నిపించ‌నున్నారు. అలాగే క‌న్మ‌ణిల్ల అనే మ‌ల‌యాళ చిత్రం కూడా ఆమె చేతిలో ఉంది. (చ‌ద‌వండి: ప్ర‌భాస్ అన్నా.. సారీ లెఫ్ట్‌ అవుతున్నా: తేజ్‌)

Actress #MiyaGeorge gets married in Kochi to her beau #AshwinPhilip Happy Married Life Miya George!

A post shared by Priya Pro (@priya__pro) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు