‘ఉక్కు సత్యాగ్రహం’ లో భాగం చేయడం సంతోషంగా ఉంది: ఎమ్మెల్యే కరణం

25 Nov, 2023 10:26 IST|Sakshi

పి.సత్యారెడ్డి లీడ్‌ రోల్‌లో నటించి, జనం ఎంటర్‌టైన్మెంట్స్‌పై స్వీయ దర్శకత్వంలో నిర్మిం చిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. శుక్రవారం సత్యారెడ్డి పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ సినిమా ట్రైలర్, పాటల విడుదల వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ–‘‘విశాఖపట్నం ఉక్కు నేపథ్యంలో సత్యారెడ్డి ‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమా తీసుకురావడం చాలా మంచి విషయం. ఈ చిత్రంలో నన్ను కూడా ఓ భాగం చేయడం సంతోషంగా ఉంది’ అన్నారు.

దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ–‘‘నేనొక కమర్షియల్‌ డైరెక్టర్‌ అయినా నాకు ఉద్యమంతో కూడిన, ప్రజా సమస్యలతో కూడిన ఉద్యమాలు చేసే సినిమాలంటే చాలా ఇష్టం. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘విశాఖ ఉక్కు ఉద్యమానికి సంబంధించిన సమస్యలతో ఈ సినిమా తీశాం’’ అన్నారు పి.సత్యారెడ్డి.  నిర్మాత దాసరి కిరణ్, దివంగత గాయకులు గద్దర్‌ కుమార్తె వెన్నెల, నటి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు