హీరో అవుతాడా?

12 Nov, 2020 05:52 IST|Sakshi
సూర్య భరత్‌చంద్ర, ప్రియా దేశపాగ్‌

షార్ట్‌ ఫిల్మ్‌లో బెస్ట్‌ యాక్టర్‌గా ‘సైమా’ అవార్డ్‌ అందుకున్న సూర్య భరత్‌ చంద్ర హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘మొదటి ఆట’. ప్రియా దేశపాగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగదీష్‌ కె.కె. దర్శకత్వంలో కిరణ్‌ కుమార్‌ రఘుపతి నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. జగదీశ్‌ కె.కె. మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా రంగంలో హీరోగా ఎదగాలనుకునే కుర్రాడు పడే కష్టాలు ఏంటి? ఈ సమయంలో తనకు పరిచయమైన అమ్మాయితో ప్రేమలో పడటం.. ఆ తర్వాత ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరో కావాలనే తన కల నెరవేరిందా? లేదా? అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. విజయనగరం, అరకులలో ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ ప్రారంభించి, చిత్రీకరణ పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘మంచి కథాంశంతో ప్రేక్షకులను మెప్పించే విధంగా రూపొందుతోన్న చిత్రమిది. మూడు ఫైట్స్, నాలుగు పాటలు ఉన్నాయి’’ అన్నారు కిరణ్‌ కుమార్‌ రఘుపతి. రాఖీ, దశరథ్, సతీష్, రేణుక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహనిర్మాతలు: బి.శారద, వి.నర్సింహారావు, సంగీతం: వంశీ కాంత్‌ రేఖానా, కెమెరా: ఆర్‌.కె. నాయుడు.

మరిన్ని వార్తలు