Mohan Babu: ఇండస్ట్రీ పిల్లలకు ఫీజులో రాయితీ ప్రకటించిన మోహన్‌ బాబు

19 Mar, 2022 08:05 IST|Sakshi

Mohan Babu announces An Educational Offer: ‘తెలుగు సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్‌కి చెందిన పిల్లలకు ‘మోహన్‌బాబు విశ్వవిద్యాలయం’లో ఫీజుల్లో రాయితీ ఇవ్వనున్నాం’ అని నటుడు–నిర్మాత మంచు మోహన్‌బాబు అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘‘47 ఏళ్లుగా సినీ కళామతల్లి నన్ను నటుడిగా, నిర్మాతగా ఆశీర్వదించి అక్కున చేర్చుకుంది. 30 ఏళ్లుగా ‘శ్రీ విద్యానికేతన్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌’కి అధినేతగా ఉన్నాను.

1992లో ఈ విద్యాలయాల ప్రారంభం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని కొంతమంది పిల్లలకు, సినిమా ఇండస్ట్రీకి చెందిన మరికొంతమంది పిల్లలకు 25శాతం మందికి కులమతాలకు అతీతంగా ఉచితంగా విద్య అందిస్తున్నాం. ఇప్పుడు శ్రీ విద్యానికేతన్‌ విద్యాలయాలన్నీ ‘మోహన్‌బాబు విశ్వవిద్యాలయం’ (యమ్‌బి యూనివర్శిటీ) గా మారింది.

నాకెంతో ఇచ్చిన తెలుగు పరిశ్రమకు ఏదైనా ఉడతా భక్తిగా చేయాలనే ఆలోచన వచ్చింది. ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్‌కి చెందినవారి పిల్లలు మా ‘యమ్‌బీయు’లో చదవాలనుకుంటే ఫీజులో రాయితీ ఇస్తాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అన్నారు.

మరిన్ని వార్తలు