సిరివెన్నెల అంత్యక్రియల్లో కనిపించని మంచు ఫ్యామిలీ, వివరణ ఇచ్చిన మోహన్‌ బాబు

4 Dec, 2021 20:16 IST|Sakshi

Mohan Babu Explains Why He Not Attend Sirivennela Sitarama Sastry Cremation: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ఇలాంటి ఒకరోజు వస్తుందని ఊహించలేదంటూ సినీప్రముఖులు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అక్ష‌ర శిల్పికి టాలీవుడ్‌ కన్నీటీ వీడ్కోలు పలికింది.

ఆయన అంత్యక్రియలకు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం కదలివచ్చి ఆయనకు తుది వీడ్కోలు చెప్పారు. స్టార్‌ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, మహేష్‌బాబు, నాగార్జున, ఎన్టీఆర్‌, పవన్‌కల్యాణ్‌, రాజశేఖర్‌, తివిక్రమ్‌, రాజమౌళి, కీరవాణి, అల్లు అర్జున్‌, రానా, నాని, సుధీర్‌బాబు, నాగబాబు, శర్వానంద్‌, వరుణ్‌సందేశ్‌, శ్రీకాంత్‌, తనికెళ్ల భరణి, ఆర్పీ పట్నాయక్‌, శివబాలాజీ, నరేశ్‌, జగపతిబాబుతో సహా నటీనటులు, క్యారెక్టర్‌ అర్టిస్టులతో పాటు సినీ ప్రముఖులు ఆయన అంత్యక్రియలకు హజరై నివాళులు అర్పించారు. అయితే ఈ కార్యక్రమంలో మంచు ఫ్యామిలీ మాత్రం ఎక్కడా కనిపించలేదు.

చదవండి: Anasuya Bhardwaj-Pushpa Movie: నోట్లో బ్లేడ్‌తో అనసూయ.. భయపెట్టిస్తోన్న లుక్‌

సినీ పరిశ్రమకు చెందిన వారికి ఎలాంటి సమస్యలు వచ్చిన, ప్రముఖులు మరణించిన ముందుగా అక్కడ ఉండేది మంచు కుటుంబమే. ఏ కార్యక్రమైన విలక్షణ నటుడు మోహన్ బాబు, ఆయన కుటుంబం తప్పకుండా హజరవుతారు. అలాంటిది తెలుగు పాటకు కోట కట్టిన సిరివెన్నెల వంటి వ్యక్తి మరణిస్తే మోహన్‌ బాబు, ఆయన కుటుంబం అక్కడ కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఏమైంది, మంచు ఫ్యామిలీ ఎందుకు రాలేదంటూ పలువురు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ మూవీ ఈవెంట్‌లో పాల్గోన్న మోహన్‌బాబు దీనిపై వివరణ ఇచ్చాడు.

చదవండి: నైటీపైనే బయటకొచ్చిన హీరోయిన్‌, ట్రోల్‌ చేస్తూ ఆడేసుకుంటున్న నెటిజన్లు

‘సిరివెన్నెల మరణంతో ఇండస్ట్రీ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది.. ఇటీవల మా ఇంట్లో నా సొంత తమ్ముడు మృతి చెందిన సంగతి తెలిసిందే. సిరివెన్నెల గారు చనిపోయిన రోజే నా తమ్ముడి పెద్దకర్మ జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు బయటికి వెళ్ల‌కూడదు. అందుకే సిరివెన్నెల భౌతికకాయం చూడడానికి ఎవరిని వెళ్ళొద్దని చెప్పా. ఆ కారణంగానే ఆయన చివరికి చూపుకు కూడా నోచుకోలేకపోయాను. ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. సినిమా పరిశ్రమలో ఇలా వరుసగా విషాధ సంఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన  కలిగిస్తోంది’ అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

మరిన్ని వార్తలు