చిరంజీవికి మోహ‌న్‌బాబు బ‌ర్త్‌డే గిఫ్ట్‌

23 Aug, 2020 14:22 IST|Sakshi

ఆదివారం వినాయ‌క చ‌వితిని టాలీవుడ్ ప్ర‌ముఖులంద‌రూ త‌మ‌తమ ఇళ్ల‌ల్లో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. అయితే సినీ ప్రేమికులు మాత్రం మ‌రో పండ‌గ‌ను కూడా జ‌రుపుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని వేడుక‌లు చేసుకున్నారు. చిరు, తాను టామ్ అండ్ జెర్రీలా ఉంటామ‌ని చెప్పుకునే డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు త‌న ఆప్త‌మిత్రుడికి బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. అది చూసి చింర‌జీవి ఎంత‌గానో సంతోషించారు. హార్లీ డేవిడ్‌స‌న్‌ ఆకృతిలో ఉన్న  బైక్ ద‌గ్గ‌ర నిలుచుని ఫొటో కూడా దిగారు. (అన్నయ్య చేయిపట్టి పెరిగాను.. పవన్‌ భావోద్వేగం)

ఆ త‌ర్వాత దాన్ని చిరు ట్విట‌ర్‌లో షేర్ చేస్తూ.. "నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజు నాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి. నీ బ‌హుమానానికి ధ‌న్య‌వాదాలు" అని రాసుకొచ్చారు. కాగా "చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్  ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్" అంటూ మోహ‌న్ బాబు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలిపారు. (మోహన్‌బాబుకు ఆగంతకుల హెచ్చరికలు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా