‘మళ్లీ జన్మలోనూ నా కూతురిగానే పుట్టాలి’

8 Oct, 2020 11:35 IST|Sakshi

నటిగా, యాంకర్‌గా టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకున్నారు మంచు లక్ష్మీ ప్రసన్న, తండ్రి మోహన్‌బాబు వారసత్వాన్ని అంది పుచ్చుకుని అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై తనదైన ముద్రవేశారు. ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంతో నటిగా దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమైన మంచు లక్ష్మి ఆ తరువాత ‘గుండెల్లో గోదారి’, ‘చందమామ కథలు’, ‘దొంగాట’, ఊకొడతారా ఉలిక్కిపడతారా, లక్ష్మి బాంబ్ వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. నేడు మంచు లక్ష్మి పుట్టిన రోజు. ఈ రోజుతో ఆమె 43వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా అటు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి, ఇటు అభిమానుల నుంచి లక్ష్మీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: రకుల్‌ ప్రీత్‌, మంచు లక్ష్మి సైక్లింగ్‌ ఫోటోలు

ఈ క్రమంలో లక్ష్మీ మంచు తండ్రి కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు కూతురుకి ప్రత్యేక బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ఎన్ని జన్మలైన లక్ష్మీనే కూతురిగా పుట్టాలని కోరుకున్నారు. ఈ మేరకు ట్విటర్‌లో ‘నా ముద్దుల కుమార్తె మంచు లక్ష్మీ ప్ర‌స‌న్న వ‌జ్ర వైఢ్యూర్య పుష్య గోమేదిక మ‌ర‌క‌త మాణిక్యం లాంటి కుమార్తె పుట్టినరోజు ఈ రోజు. మ‌రొక జ‌న్మంటూ ఉంటుందో లేదో తెలియ‌దు గానీ ఉంటే మ‌ళ్లీ ఈ ల‌క్ష్మీప్ర‌స‌న్నే నాకు కూతురిగా పుట్టాల‌ని, నేను త‌న‌కు తండ్రిగా పుట్టాల‌ని ఆ పంచ భూతాల‌ని ప్రార్ధిస్తున్నాను, హ్యాపీ బ‌ర్త్‌డే టూ మై డియ‌ర్ ల‌వ్లీ ల‌క్ష్మీమంచు’ అని మోహ‌న్ బాబు పేర్కొన్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు