కోవిడ్‌ ఫండ్‌కు శంకర్‌ రూ.10 లక్షల విరాళం

17 May, 2021 12:59 IST|Sakshi

దర్శకుడు శంకర్‌ రూ.10 లక్షల విరాళం

నిర్మాత మోహన్‌ కుటుంబం రూ.10 లక్షల విరాళం

దర్శకుడు వెట్రిమారన్‌ రూ.10 లక్షల విరాళం

కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా అనేకమంది ప్రాణాలను బలిగొంటోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కరోనా వైరస్‌ నుంచి ప్రజలను కాపాడడానికి రాష్ట్రప్రభుత్వం తగిన చర్యలను తీసుకుంటోంది. అయితే ప్రజలకు ఆర్థికసాయం చేయడానికి, కరోనా బాధితుల కోసం ఆక్సిజన్, వ్యాక్సిన్‌ వంటి వైద్య సదుపాయాలను సమకూర్చడానికి ఆర్థిక పరమైన అవసరాలు ఏర్పడడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ దాతలు కరోనా నివారణ నిధికి ఆర్థికసాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.


ముఖ్యమంత్రికి చెక్కు అందిస్తున్న ఎడిటర్‌ మోహన్‌ కుటుంబం

దీంతో సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇప్పటికే శివకుమార్‌ కుటుంబం, అజిత్, సౌందర్య రజనీకాంత్‌ కుటుంబం తదితరులు విరాళాలు అందించారు. తాజాగా మరికొందరు సినీ దర్శక నటులు కరోనా నివారణ నిధికి విరాళాలు అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. నటుడు శివకార్తికేయన్‌ శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి రూ.25 లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. అదేవిధంగా నిర్మాత, ఎడిటర్‌ మోహన్, ఆయన కుమారులు దర్శకుడు మోహన్‌రాజ, నటుడు జయం రవి ముఖ్యమంత్రిని కలిసి రూ.10 లక్షలు విరాళాన్ని అందించారు.


దర్శకుడు వెట్రిమారన్

దర్శకుడు శంకర్‌ కరోనా నివారణకు రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. ఈ మొత్తాన్ని ఆయన ఆన్‌లైన్‌ ద్వారా ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్‌కు పంపించారు. అదేవిధంగా దర్శకుడు వెట్రిమారన్‌ ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి రూ.10 లక్షల విరాళాన్ని చెక్కు ద్వారా అందించారు. రజనీకాంత్, విజయ్, ధనుష్, శింబు తదితర ప్రముఖులు ఇంకా తమ విరాళాలను ప్రకటించలేదు. అజిత్‌ విరాళాన్ని ప్రకటించడంతో ఆయనకు పోటీదారులుగా భావించే విజయ్‌ ఇంకా విరాళాన్ని ప్రకటించలేదు. కాగా సినీ కార్మికులను ఆదుకునేందుకు నటుడు అజిత్‌ స్పందించి రూ.10 లక్షలు ఇచ్చినట్లు ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి వెల్లడించారు.


నటుడు శివకార్తికేయన్‌

చదవండి: పాపం పావలా శ్యామల.. తిండిలేక, అనారోగ్యంతో..

సీఎం స్టాలిన్‌ను కలిసిన సూర్య ఫ్యామిలీ... కోటి విరాళం

కష్టకాలంలో ఉన్నాం.. విరాళాలివ్వండి: ముఖ్యమంత్రి పిలుపు

మరిన్ని వార్తలు