లూసీఫర్‌ రీమేక్‌: చిరు కోసం తమన్‌ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్‌ థీమ్‌

28 Jun, 2021 19:45 IST|Sakshi

మోహన్‌ రాజా డైరెక్షన్‌లో మెగాస్టార్‌ చిరంజీవి 153వ చిత్రం తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసిఫర్‌ను మోహన్‌ రాజా తెలుగులో చిరుతో రీమేక్‌ చేస్తున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా తాజాగా ఈ లూసిఫర్‌ నుంచి ఓ అప్‌డేట్‌ వచ్చింది. కాగా ఈ మూవీకి తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్‌ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నట్లు తమన్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. ఇందులో ఎలివేషన్స్‌ మలయాళం కంటే ఎక్కువగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తమన్‌ చిరు కోసం మంచి బ్యాక్‌గ్రౌండ్‌ థీమ్‌ సిద్దమైనందని పేర్కొన్నాడు.

ఈ క్రమంలో సోమవారం డైరెక్టర్‌ మోహన్‌ రాజా, తమన్‌లు చర్చించుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ‘చిరు 153వ మూవీ మ్యూజికల్‌ సిట్టింగ్‌పై వర్క్‌ జరుగుతుంది. త్వరలోనే షూటింగ్‌ కూడా ప్రారంభం కానుంది’ అంటూ ట్వీట్‌ చేసింది. కాగా ప్రస్తుతం చిరు కొరటాల శివతో ఆచార్య మూవీ చేస్తున్నాడు. దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ మూవీ క్లైమాక్స్‌ సన్నివేశాల చిత్రీకరణ జరపుకుంటోంది. దీంతో చిరు ఆచార్య షూటింగ్‌లో ఫుల్‌ బీజీగా ఉన్నాడు. ఈ మూవీ పూర్తైయిన వెంటనే మెగాస్టార్‌ లూసిఫర్‌ షూటింగ్‌ను ప్రారంభించనున్నాడని సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు