Mohanlal Money Laundering Case: మోహన్‌ లాల్‌కు ఈడీ నోటీసులు.. ఎందుకంటే ?

14 May, 2022 17:05 IST|Sakshi

Mohanlal Questioned By Ed In Money Laundering Case With Monson Mavunkal: మలయాళ సూపర్‌ స్టార్ మోహన్‌ లాల్‌ చిక్కుల్లో పడ్డారు. మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు మోహన్‌ లాల్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మోహన్ లాల్‌కు నోటీసులు పంపింది. వచ్చే వారం కొచ్చి ఈడీ కార్యాలయంలో మోహన్‌లాల్‌ను అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్‌ మాన్కల్‌తో కలిసి మోహన్ లాల్‌ మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయని అధికారులు తెలిపారు.  అయితే ప్రజలను రూ. 10 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై మాన్సన్‌ను గత సెప్టెంబర్‌లోనే కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కేరళలో ఉన్న మాన్సన్‌ ఇంటికి మోహన్‌ లాల్‌ ఒకసారి వెళ్లినట్లు సమాచారం. అయితే అలా మోహన్‌ లాల్‌ వెళ్లడానికి కారణాలు తెలియరాలేదు. 

'కేరళకు చెందిన మాన్సన్ మాన్కల్ కొన్నేళ్లుగా పురాతన కళాఖండాలు, అవశేషాలను సేకరించేవాడిగా నటిస్తూ వాటిని అమ్మి రూ. 10 కోట్ల వరకు మోసం చేశాడు. అతని దగ్గర టిప్పు సుల్తాన్‌ సింహాసనం, మోసెస్ సిబ్బంది, ఔరంగజేబు ఉంగరం, ఛత్రపతి శివాఝీ భగవద్గీత కాపీ, సెయింట్ ఆంటోనీ వేలిగోరు వంటి వస్తువులు ఉన్నాయని చెప్పాడం అబద్ధం.' అని కేరళ పోలీసులు తెలిపారు. కాగా కేరళలోని అలప్పుజా జిల్లాలో నకిలీ పురాతన వస్తువులు విక్రయిస్తున్నాడని 52 ఏళ్ల యూట్యూబర్‌ను కూడా కేరళ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు