స్నేహం మాత్రమే!

17 Aug, 2020 01:40 IST|Sakshi
ప్రణవ్‌ మోహన్‌ లాల్, ‌ కల్యాణీ ప్రియదర్శన్

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్, స్టార్‌ డైరెక్టర్‌ ప్రియదర్శన్‌ ఆప్త మిత్రులు. ఒకరి కెరీర్‌ కి ఒకరు ఎంతగానో సహాయపడ్డారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌ లో మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. మోహన్‌ లాల్‌ కుమారుడు ప్రణవ్‌ మోహన్‌ లాల్‌ ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రియదర్శన్‌ కూతురు కల్యాణీ ప్రియదర్శన్‌ తెలుగు సినిమా ‘హలో’ ద్వారా హీరోయిన్‌ గా పరిచయమైంది.

తాజాగా ప్రణవ్, కల్యాణి మలయాళంలో ఓ సినిమా కమిట్‌ అయ్యారు. ఈ ఇద్దరూ చిన్నప్పటి నుంచీ ఫ్రెండ్స్‌. ఆ మధ్య ప్రణవ్, కల్యాణి దిగిన సెల్ఫీ ఒకటి వైరల్‌ అయింది. దీంతో ఈ ఇద్దరూ రిలేషన్‌ లో ఉన్నట్టు మలయాళం ఇండస్ట్రీ లో వార్తలు మొదలయ్యాయి. ‘‘ప్రణవ్, కల్యాణి లవ్‌ లో ఉన్నారా? అనే ప్రశ్న మోహన్‌ లాల్‌ వరకూ వెళ్లింది. ఈ విషయం గురించి మోహన్‌ లాల్‌ మాట్లాడుతూ – ‘ప్రణవ్, కల్యాణి బెస్ట్‌ ఫ్రెండ్స్‌. నేను, ప్రియదర్శన్‌ ఎలానో వాళ్లిద్దరూ అలా.

ఒక్క సెల్ఫీ వల్ల ఇద్దరూ రిలేషన్‌ లో ఉన్నారని ఎలా ఊహించుకుంటారు? అనవసరమైన వార్తలు ప్రచారం చెయ్యొద్దు. నమ్మొద్దు’’ అని ఈ వార్తలను కొట్టిపారేశారు. మోహన్‌ లాల్‌ నటించిన ‘అరబికడలింటే సింహం: మరాక్కర్‌’లో ప్రణవ్, కల్యాణి కూడా నటించారు. అలానే ‘హదయమ్‌’  అనే సినిమాలో జంటగా నటిస్తున్నారు కూడా. ఈ సినిమా షూటింగ్‌ కరోనా వల్ల ఆగిపోయింది.

మరిన్ని వార్తలు