మిథున్‌‌ చక్రవర్తి కుమారుడిపై అత్యాచారం కేసు

17 Oct, 2020 16:14 IST|Sakshi

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి కుమారుడు, నటుడు మహాక్షయ్‌పై అత్యాచారం కేసు నమోదైంది. మహాక్షయ్‌ అత్యాచారం చేసి, మోసం చేసినట్లు 38 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేయడంతో ఓషివారా పోలీసు స్టేషన్‌లో గురువారం రాత్రి ఫిర్యాదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. దీంతో అతడిపై అత్యాచారం, మోసం కేసు నమోదు చేసినట్లు ఓషివారా పోలీసు అధికారి వెల్లడించారు. దీనిపై సదరు అధికారి మీడియాతో మాట్లాడుతూ.. బాధిత మహిళతో మహాక్షయ్‌ 2015 నుంచి 2018 వరకు కలిసి ఉన్నాడని తెలిపారు. ఈ నేపథ్యంలో అతడు ఆమెను వివాహం కూడా చేసుకుంటానని మోసం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. 2015లో పశ్చిమ అంధేరిలో మహాక్షయ్‌ కోనుగోలు చేసిన ఇంటిని ఆమె చూడటానికి వెళ్లగా సాఫ్ట్‌ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొందన్నారు. (చదవండి: చివరి చూపు చూడలేదు)

తాను గర్భవతి అయిందని ఆ విషయం అతడికి చెప్పడంతో అబార్షన్‌ చేసుకోవాలని కోరుతూ బలవంతంగా గర్భస్రావం మందులు ఇచ్చినట్లు ఆరోపించింది. తనను పెళ్లి చేసుకోవాలని బాధిత మహిళ మహాక్షేను ప్రశ్నించినప్పుడల్లా మాట దాటేస్తూ తనని మూడేళ్లు మోసం చేశాడని తెలిపారు. 2018 జనవరిలో కూడా మరోసారి తమ వివాహం గురించి ప్రశ్నించగా అతడు చేసుకోనని తెల్చిచెప్పడంతో వారి మధ్య గొడవలు కూడా జరిగాయని చెప్పారు. ఈ విషయంపై అతడి తల్లి యోగితా బాలి కూడా తనని బెదిరించినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. దీంతో 2018లో ఢిల్లీలోని బేగంపూర్‌ పోలీసు స్టేషన్‌లో మహాక్షయ్‌తో పాటు అతడి తల్లిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు 376(అత్యాచారం) 313(బలవంతంగా గర్భస్రావం చేయడం) కేసులు నమోదు చేసి హైకోర్టుకు పంపినట్లు చెప్పారు. (చదవండి: కంగనా సిస్టర్స్‌కు కోర్టు షాక్)

హైకోర్టు మహాక్షయ్‌, అతడి తల్లికి ముందస్తు బెయిల్‌ మంజూర్‌ చేసి స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేయాల్సిందిగా బాధిత మహిళకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ మేరకు 2020 జులైలో ఓషివారా పోలీసు స్టేషన్‌లో బాధిత మహిళ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్‌లు 376(అత్యాచారం) 376(2)(ఎన్‌) (పలుమార్లు అత్యాచారం చేయడం) 328(అంగీకారం లేకుండా గర్భస్రావం చేయడం, బాధకలిగించడం, బలవంతం చేయడం) 417(మోసం చేయడం), 506(క్రిమినల్‌ బెదిరింపులు) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే మహాక్షయ్‌ హాంటెడ్‌ 3డీ, లూట్‌ వంటి చిత్రాల్లో నటించాడు. (చదవండి: వివేక్‌ ఒబెరాయ్‌ భార్యకు నోటీసులు!)

మరిన్ని వార్తలు