అనుమానాస్పద స్థితిలో ప్రముఖ నటుడి భార్య మృతి..

15 May, 2021 16:20 IST|Sakshi

వరకట్న వేధింపులే కారణమని ఆరోపించిన మృతురాలి బంధువులు

ప్రేమించి పెళ్లిచేసుకున్న ఉన్నిరాజన్‌-ప్రియాంకలు

ప్రముఖ దివంగత నటుడు రాజన్ పీ దేవ్ కుమారుడే ఉన్నిరాజన్‌

ప్రముఖ మలయాళ నటుడు ఉన్నిరాజన్ పీ దేవ్‌ భార్య ప్రియాంక  అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనం రేపుతోంది. మరోవైపు వరకట్నం తేవాలని భర్త ఉన్నిరాజన్ వేదిస్తున్నాడని వట్టప్పర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ప్రియాంక ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. వివరాల ప్రకారం ఉన్నిరాజన్‌ భార్య ప్రియాంక బుధవారం రాత్రి తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని విగతజీవితా కనిపించారు.

అయితే ఇది ఆత్మహత్య కాదని, భర్త, నటుడు ఉన్నిరాజన్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పెళ్లి అయిన నాటి నుంచి ఉన్నిరాజన్‌ కట్నం డిమాండ్‌ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ఉన్నిరాజన్ ఆగడాలు మొదట్లో తమకు తెలిసేవి కాదని, అయితే పదేపదే డబ్బులు డిమాండ్‌ చేస్తుండటంతో అతడి నైజం బయటడిందని, అంతేకాకుండా తమ కూతురిని శారీరకంగా హింసించేవాడని కుటుంబసభ్యులు అంటున్నారు. 


ఇక 2019లో ఉన్నిరాజన్-ప్రియాంకలు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అయితే వివాహం అయిన కొన్నాళ్లకే వీరి మధ్య కలహాలు వచ్చాయని, తన వ్యక్తిగత అవసరాలకు ప్రియాంక నగలు కూడా నమ్మేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఎంత డబ్బు అడిగినా ప్రియాంక తల్లి వెంటనే ట్రాన్స్‌ఫర్‌ చేసేదని కానీ తన భర్త అడుగుతున్నట్లు కాకుండా, తనకే అవసరం ఉందని ప్రియాంక చెప్పేదని పేర్కొన్నారు.

కొద్ది రోజుల నుంచి ఉన్ని రాజన్‌ పెట్టే టార్చర్‌ను భరించలేక విషయం తమకు చెప్పిందని, శారీరక హింసకు పాల్పడినట్లు వీడియోలు కూడా ఉన్నాయని చెప్పారు. అతడిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మరుసటి రోజే  ప్రియాంక మృతిచెందడం అనుమానాలకు తివిస్తోందన్నారు. ఇక ఉన్నిరాజన్‌ మరెవరో కాదు ప్రముఖ మలయాళ నటుడు దివంగత రాజన్ పీ దేవ్ కుమారుడు. పవన్ కల్యాణ్ నటించిన ఖుషీ సినిమా ద్వారా రాజన్ పీ దేవ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ నటించిన ఆది సినిమాలోను ప్రతినాయకుడి పాత్రలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు