Club House Scam: టాప్​ హీరోహీరోయిన్ల ఫేక్​ ఫ్రొఫైల్స్​

5 Jun, 2021 17:17 IST|Sakshi

ఆడియోకు మాత్రమే అవకాశం ఉండే నెట్‌వర్కింగ్‌ యాప్‌ ‘క్లబ్‌ హౌస్‌’.. ఇప్పుడు సెలబ్రిటీలకు తలనొప్పిగా మారింది. ఎలాంటి ఇన్విటేషన్​ లేకుండా ఆ యాప్​లో జాయిన్​ అయ్యే అవకాశం ఈమధ్యే కల్పించారు. దీంతో సెలబ్రిటీల పేర్లతో ఫేక్​ ఫ్రొఫైల్స్​ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై తమకేం సంబంధం లేదని హీరోహీరోయిన్లు వరుసగా స్టేట్​మెంట్లు రిలీజ్ చేస్తున్నారు. 

ఈమధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ఆడియో యాప్​ ‘క్లబ్​హౌజ్​’ సెలబ్రిటీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఫేక్​ ఫ్రొఫైల్స్​తో నటీనటులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా మలయాళీ నటులు ఈ యాప్​తో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఇదివరకే దుల్కర్​ సల్మాన్​, సీనియర్​ హీరో సురేష్​ గోపీ ఈ యాప్​లో తమకు ప్రొఫైల్స్​ లేవని స్పష్టం చేయగా, తాజాగా మరో యంగ్ స్టార్​ నివీన్ పౌలీ స్పందించాడు.


 
‘‘హలో ఫ్రెండ్స్​. నాకు క్లబ్​హౌజ్​లో ఎలాంటి అకౌంట్ లేదు. ఫేక్​ ఫ్రొఫైల్స్​ క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్ ఓపెన్​ చేసినా.. ముందు మీకు చెప్తాను’’ అని క్లారిటీ ఇచ్చాడు. కాగా, సీనియర్ హీరో సురేష్​ గోపీ, దుల్కర్​ కూడా ఇది వరకు ఇదే విషయాన్ని ట్వీట్ల ద్వారా తెలియజేశారు. ఇక యంగ్ హీరోయిన్​ రాధికా వేణుగోపాల్​ సాధిక కూడా ఈ ఫేక్​ స్కామ్​పై రియాక్ట్ అయ్యింది. టోవినో థామస్​, జోజు జార్జ్​లతో పాటు తన పేరుతో ఉన్న ఫ్రొఫైల్స్​ ‘ఫేక్’ అంటూ ఇన్​స్టాగ్రామ్​లో ఆమె ఉంచింది. 

క్లబ్​హౌజ్​ ఏంటంటే..
ఆండ్రాయిడ్‌ వెర్షన్​ కోసం క్లబ్​హౌజ్​ను మనదేశంలో ఈ ఏప్రిల్‌లోనే లాంఛ్​ చేశారు. ఇది రెగ్యులర్ ఫొటో, వీడియో షేర్​ యాప్స్​ల్లాగా కాదు.  ఇందులో ఆడియో కన్వర్జేషన్ల ద్వారా అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు. ఇందులో చేరాలనుకున్న వ్యక్తులకు ఇదివరకే సభ్యులైన వారినుంచి ఇన్విటేషన్‌ ఉండాలనే నిబంధన ఇంతకు ముందు ఉండేది. అయితే ఈ మధ్యే ఆ రూల్​ను సవరించడంతో అడ్డగోలుగా జాయిన్​ అవుతున్నారు. పలువురు సెలిబ్రిటీలు, ఇన్వెస్టర్లు, పొలిటీషియన్లు, ఎంట్రాప్రెన్యూర్లు  దీన్ని ఉపయోగించడం వల్ల క్లబ్​హౌజ్​కి క్రేజ్​ పెరుగుతోంది. ఇక  ప్రముఖ నగరాల్లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న క్లబ్​హౌజ్ ఆడియో కన్వర్జేషన్​ యాప్​​.. కేరళలో మాత్రం ఒక ట్రెండ్ సెట్టర్​గా మారింది. ప్రత్యేకంగా ఆన్​లైన్​ రూమ్స్​తో సినిమాలు, రాజకీయాలు.. ఇలా ప్రతీ టాపిక్​పై మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఛాయ కడా(టీ కొట్టు) కి మంచి క్రేజ్ ఉంటోంది. ఈ తరుణంలోనే ఇలా హీరోహీరోయిన్ల పేర్లతో ఫేక్​ ప్రొఫైల్స్​ క్రియేట్ అవుతున్నాయి.

A post shared by Sadhika Venugopal official (@radhika_venugopal_sadhika)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు