ఛాలెంజ్‌ స్వీకరించిన మోనాల్‌.. మరో నలుగురికి!

25 Jan, 2021 20:57 IST|Sakshi

పర్యావరణం పచ్చగా ఉండాలనే దృఢ సంకల్పంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.  విజయవంతంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో పలువురు సినీ నటులు, రాజకీయ ప్రముఖులు పాల్గొని బాధ్యతాయుతంగా మొక్కలు నాటారు. తాజాగా బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మోనాల్‌ సోమవారం మొక్కలు నాటారు. మరో కంటెస్టెంట్‌ దేత్తడి హారిక విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటారు. చదవండి: స్పెషల్‌ సాంగ్‌..మోనాల్‌కు అంత రెమ్యునరేషనా?

అనంతరం మోనాల్‌ మాట్లాడుతూ.. జోగినపల్లి సంతోష్ కుమార్ నుంచి ప్రేరణ తీసుకొని సవాలును స్వీకరించి మొక్కలు నాటనని తెలిపారు. అడవులు మరియు పర్యావరణాన్ని కాపాడటానికి ఎంపి సంతోష్ కుమార్  చేసిన అద్భుతమైన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పేర్కొన్నారు. అలాగే మరో నలుగురు ( మాకప ఆనంద్ , మిత్ర గాద్వి , క్రిష్ణ కుల్ శేకరన్ , మల్హాత్ థాకర్‌) లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని సూచించింది. చదవండి: అదే అసలైన ‘రిపబ్లిక్’‌ అంటున్న మెగా మేనల్లుడు

మరిన్ని వార్తలు