చిరంజీవి పాటకు స్టెప్పులేసిన బిగ్‌బాస్‌ భామ, ఫ్యాన్స్‌ ఫిదా

9 Mar, 2021 18:56 IST|Sakshi

మోనాల్‌ గజ్జర్‌.. ఒకప్పుడు ఎవరికి తెలియదు. హీరోయిన్‌గా ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు ఒక్కసారిగా బిగ్‌బాస్‌ షోతో వచ్చేసింది. ఫేడ్‌ అవుట్‌ అయిన హీరోయిన్‌గా తెలుగు బిగ్‌ బాస్‌ 4 సిజన్‌లో కంటెస్టెంట్‌గా హౌజ్‌లో అడుగుపెట్టిన ఈ గుజరాతి భామ ఇప్పుడు అందరి నోళ్లల్లో నానుతోంది. 98 రోజుల పాటు హౌజ్‌లో కొనసాగి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దీంతో బయటకు రాగానే మోనాల్‌కు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. అంతేగాక దర్శక నిర్మాతల నుంచి ఆమెకు వరుస ఆఫర్లు  వచ్చిపడుతున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా ఇటీవల వచ్చిన ‘అల్లుడు అదుర్స్’‌లో స్పెషల్‌ సాంగ్‌లో ఆడిపాడిన సంగతి తెలిసిందే.

ఇందులో మోనాల్‌ డ్యాన్స్‌, ఎక్స్‌ప్రెషన్‌కు ఫ్యాన్స్ అంతా‌ ఫిదా అయ్యారు. ఆ తర్వాత స్టార్‌ మాలో వస్తున్న డ్యాన్స్‌ ప్లస్‌ రియాలిటీ షోకు మెంటర్‌గా చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా స్టేజ్‌పై కాలు కదుపుతోంది ఈ భామ. ఈ క్రమంలో తాజాగా స్టార్‌ మా డ్యాన్స్‌ ప్లస్ షో‌ ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో మోనాల్‌ డ్యాన్స్‌ చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

మెగాస్టార్‌ చిరు-రోజాల సూపర్‌ హిట్‌ సాంగ్‌ మావ మావ పాటకు బాబా భాస్కర్‌ మాస్టర్‌తో కలిసి ఆకుపచ్చ రంగు చీరలో మోనాలు చిందులేసింది. ప్రస్తుతం వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇక జియా చార్లీ చాప్లీస్‌గా అందరిని ఆకట్టుకొగా బాబా భాస్కర్‌, యశ్, రఘు మాస్టర్లు ఒక గ్రూప్‌గా, అనీ మాస్టర్‌, ముమైత్‌ ఖాన్‌, మోనాల్‌ ఒక గ్రూప్‌గా పంజా మూవీలో ఐటెం సాంగ్‌ వెయ్‌రా చెయ్యి వేయ్‌రా పాటకు డ్యాన్స్‌ చేసి స్టేజ్‌పై రచ్చరచ్చ చేశారు.

చదవండి: 
సోషల్‌ హల్‌చల్‌: కళ్లతో కైపెక్కిస్తోన్న భామలు
ఏకధాటిగా 21 గంటలు షూటింగ్‌లో పాల్గొన్నా

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు