మహేశ్‌తో స్పెషల్‌ సాంగ్‌: మోనాల్‌ క్లారిటీ!

2 Feb, 2021 16:13 IST|Sakshi

బిగ్‌బాస్‌కు ముందు వరకు ఒక లెక్క, ఆ తర్వాత మరో లెక్క అన్నట్లుగా ఉంది నటి మోనాల్‌ గజ్జర్‌ పరిస్థితి. ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో ఆమె సొంతమైంది. తనకు పేరు తెచ్చిన స్టార్‌ మా ఛానల్‌లోనే డ్యాన్స్‌ ప్లస్‌ షోకి జడ్జిగా వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. అల్లుడు అదుర్స్‌లో ప్రత్యేక గీతంలో బెల్లంకొడ శ్రీనివాస్‌తో కలిసి స్టెప్పులేసి అదరగొట్టింది. తాజాగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సినిమా సర్కారు వారి పాటలోనూ ప్రత్యేక గీతంలో స్టెప్పులేయనుందన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. (చదవండి: పీనట్‌ డైమండ్‌ హిట్‌ అవ్వాలి)

అయితే నిజంగానే ఈ బ్యూటీ మహేశ్‌తో డ్యాన్స్‌ చేసే ఛాన్స్‌ కొట్టేసిందా? అని పలువురు సందేహపడ్డారు కూడా! దీనిపై తాజాగా మోనాల్‌ స్పందిస్తూ.. ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది. సర్కారు వారి పాట సినిమాలో తను ఎలాంటి స్పెషల్‌ సాంగ్‌లో ఆడిపాడటం లేదని స్పష్టం చేసింది. కాగా మోనాల్‌ ఇటీవలే బిగ్‌బాస్‌ రీయూనియన్‌ పార్టీలో తళుక్కున మెరిసింది. స్టార్‌ మా చేపట్టిన ఈ కార్యక్రమంలో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగిన పలు ఫొటోలను సెలబ్రిటీలు షేర్లు చేస్తుండటంతో ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. (చదవండి: ఆచార్యలో మరోసారి లెట్స్‌ డు కుమ్ముడు!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు