ఎయిర్ పోర్ట్‌లో మోనాల్‌కి షాక్‌.. తెగ బాధేసిందంటూ..

16 Jan, 2021 20:56 IST|Sakshi

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన ఒకే ఒక్క పేరు మోనాల్‌ గజ్జర్‌. తొలుత అభిజిత్‌తో సన్నిహితంగా ఉండటం.. ఆ తర్వాత అఖిల్‌తో క్లోజ్‌గా మూవ్‌ కావడం, ఈమె వల్లే వారిద్దరు గొడవ పడటం..ఈ సీజన్‌కి హైలెట్‌గా నిలిచాయి. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో ఎక్కువ ఎపిసోడ్లు కూడా ఈ ముగ్గురిపైనే ప్రసారం జరిగింది. ముఖ్యంగా హౌజ్‌లో అఖిల్- మోనాల్‌ల మ‌ధ్య రిలేష‌న్ వీక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంది. బిగ్‌బాస్‌లో పాల్గొన‌క‌ముందు ఈ భామ ప‌లు తెలుగు సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ.. అప్ప‌టి కంటే ఎక్కువ క్రేజ్ ఈమెకు బిగ్‌బాస్‌లో పాల్గొన‌డం ద్వారా వ‌చ్చింది. ఇక హౌస్‌ నుంచి బయటకు వచ్చకా.. ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో ఫుల్‌ బిజీ అయిపోయింది. ఇప్పటికే ‘అల్లుడు అదుర్స్' సినిమాలో ఐటమ్ సాంగ్‌ చేయడంతో పాటు ఓంకార్ నిర్వహించే డ్యాన్స్‌ షోకు జడ్జ్‌గా చేస్తోంది.

ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత ఆహ్మదాబాద్‌కు వెళ్లి వచ్చిన ఈ బ్యూటీకి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఊహించని షాక్‌ తగిలిందట. ఎయిర్‌పోర్టులో కొందరు తనను చూసి అఖిల్ ఎలా ఉన్నాడు అని గట్టిగా అరిచారట. వాళ్లు అలా అరవడం ఆమెకు కాస్త ఇబ్బందిగా అనిపించిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపారు. తాజాగా ఓ తెలుగు టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోనాల్‌ మాట్లాడుతూ..‘ బిగ్ బాస్‌కి ముందు నేను చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సుడిగాడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ వచ్చి ఐదేళ్లుపైనే అయ్యింది. చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ వల్ల మోనాల్ అంటే అందరికీ తెలిసింది. మొన్న అహ్మదాబాద్ నుంచి ఫ్లైట్‌లో హైదరాబాద్ వస్తున్నాను ఎయిర్ పోర్ట్‌లో మోనాల్ అని గుర్తించారు. నా ఓన్ సిటీలో నన్ను గుర్తుపట్టడం చాలా హ్యాపీగా అనిపించింది. అయితే వాళ్లు అఖిల్ ఎలా ఉన్నాడని అడుగున్నారు. అలా అఖిల్‌ పేరు అడగడం మాత్రం నన్ను బాధిస్తోంది.  బిగ్ బాస్ చూసిన తరువాత చాలామంది అఖిల్-మోనాల్ టుగెదర్ అని అనుకుంటున్నారు అలా ఏం లేదు. అఖిల్ వాళ్ల ఇంటి దగ్గర ఉంటాడు. నాతో ఎందుకు వస్తాడు. కాబట్టి నన్ను ఇకపై అలా అగడొద్దని అందరినీ కోరుతున్నాను’ అంటూ మోనాల్‌ తన మనసులోని బాధను వివరించింది. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు