మోనాల్‌ స్టెప్పుల్‌

30 Dec, 2020 00:48 IST|Sakshi
మోనాల్‌ గజ్జర్

‘బిగ్‌బాస్‌ 4’లో తన ఎమోషన్స్‌తో బుల్లితెర  ప్రేక్షకుల మనసును షేక్‌ చేసిన మోనాల్‌ గజ్జర్‌ బిగ్‌ స్క్రీన్‌పై స్టెప్పులతో షేక్‌ చేయటానికి రెడీ అయ్యారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ïß రోగా నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్‌’ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో కాలు కదుపుతున్నారు మోనాల్‌. ‘సుడిగాడు’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన మోనాల్‌ ఆ తర్వాత పలు చిత్రాల్లో కథానాయికగా నటించారు. గడచిన మూడేళ్లలో గుజరాతీ, మరాఠీ చిత్రాలు చేశారు. ప్రస్తుతం ఓ హిందీ సినిమా, ఓ గుజరాతీ సినిమా చేస్తున్నారు.

ఇప్పుడు ‘అల్లుడు అదుర్స్‌’లో స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనున్నారు. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ పెప్పీ నెంబర్‌లో సినిమాలోని ప్రధాన తారాగణమంతా స్టెప్పులేస్తారు. సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్‌ పతాకంపై సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కందిరీగ’ ఫేమ్‌ సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకుడు. శ్రీనివాస్‌ సరసన అనూ ఇమ్మాన్యుయేల్, నభా నటేశ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 15న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు