Monalisa: ముఖంతో సహా ఒళ్లంతా పేడ రుద్దుకున్న నటి

24 Aug, 2022 21:40 IST|Sakshi

భోజ్‌పురి సెన్సేషన్‌, బిగ్‌బాస్‌ 10 కంటెస్టెంట్‌ మోనాలిసాకు సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే. తన ఫొటోలు, డ్యాన్స్‌ వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుందీ నటి.  తాజాగా ఆమెకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఇందులో ఆమె తన శరీరం మొత్తానికి ఆవుపేడ పూసుకుంది. ముఖంతో సహా బాడీ అంతటికీ పేడను దట్టంగా పట్టించింది. అయితే పేడ రుద్దడంతో ఆమెకు దురద మొదలవగా దాన్ని భరించలేక మెలికలు తిరిగిపోయింది. ఇక ఇది చూసిన నెటిజన్లు.. ఇదేదో కామెడీ షోలో యాక్టింగ్‌ చేసినట్లుగా ఉందంటూ ఛలోక్తులు విసురుతున్నారు.

కాగా బిగ్‌బాస్‌తో పాటు నాచ్‌ బలియే డ్యాన్స్‌ షోలో పాల్గొన్న మోనాలిసా.. ఇటీవల స్మార్ట్‌ జోడీ అనే షోలో తన భర్త విక్రాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌తో కలిసి పాల్గొంది. ఈ షోలో ఆమె మాట్లాడుతూ.. వెండితెరపై తాను పోషించిన పాత్రలు చూసి జనాలు తనను అసహ్యించుకునేవారని తెలిపింది. ఇదిలా ఉంటే ఆమె రాత్రి కే యాత్రి 2 అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది.  ఇది త్వరలో హంగామా ప్లే అనే ఓటీటీలో ప్రసారం కానుంది.

చదవండి: వాళ్లిద్దరూ నా షోలో ఎప్పటికీ అడుగు పెట్టరు
మళ్లీ పెళ్లి చేసుకోనున్న మేఘనా సర్జా?

మరిన్ని వార్తలు