నా భర్త విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వను: స్వాతీ రెడ్డి

27 Sep, 2023 00:32 IST|Sakshi

‘‘శ్రీకాంత్‌ తీసిన ‘భానుమతి రామకృష్ణ’ సినిమాలో చాలా క్లిష్టమైన భావోద్వేగాలు ఉన్నాయి. ఆయన తీసిన ఈ ‘మంత్‌ ఆఫ్‌ మధు’లోనూ అలాంటి భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని హీరో సాయిధరమ్‌ తేజ్‌ అన్నారు. నవీన్‌ చంద్ర, స్వాతీ రెడ్డి ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్‌ నాగోతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంత్‌ ఆఫ్‌ మధు’. యశ్వంత్‌ ములుకుట్ల క్రిషివ్‌ ప్రొడక్షన్స్, హ్యాండ్‌ పిక్డ్‌ స్టోరీస్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా అక్టోబర్‌ 6న విడుదల కానుంది. మంగళవారం జరిగిన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న సాయిధరమ్‌ తేజ్‌ ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు.

నవీన్‌ చంద్ర మాట్లాడుతూ – ‘‘మా సినిమాకి మంచి కథ, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్‌.. ఇలా అన్నీ బాగా కుదిరాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా చూసినవారు సర్ర్‌పైజ్‌ అవుతారు’’ అన్నారు స్వాతీ రెడ్డి. అలాగే తన భర్త నుంచి స్వాతి విడాకులు తీసుకున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ విషయంపై క్లారిటీ ఇస్తారా అని అడగ్గా.. ‘‘నేనివ్వా’’ అన్నారు స్వాతి. ‘‘మంత్‌ ఆఫ్‌ మధు’ అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు శ్రీకాంత్‌ నాగోతి. చిత్ర సహనిర్మాత సుమంత్‌ దామ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ రఘువర్మ పేరూరి, నటీనటులు శ్రేయ, రాజా రవీంద్ర, హర్ష, యశ్వంత్‌ పాల్గొన్నారు.  - స్వాతీ రెడ్డి

మరిన్ని వార్తలు