Month Of Madhu Trailer: 'దేనికండి సెటిల్‌మెంట్‌.. ప్రేమించినందుకా'..ఆసక్తిగా ట్రైలర్!

26 Sep, 2023 21:41 IST|Sakshi

కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర జంటగా నటించిన చిత్రం మంత్ ఆఫ్ మధు. ఈ చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిపుర సినిమాలో జంటగా నటించిన వీరిద్దరు మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. 

ట్రైలర్ చూస్తే భార్య, భర్తల మధ్య జరిగే గొడవలే కథాశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సరికొత్త కాన్సెప్ట్ కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే టీజర్‌ రిలీజ్‌ కాగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో శ్రేయ నవిలే, మంజుల ఘట్టమనేని, హర్ష చెముడు, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, రాజా చెంబోలు, రాజా రవీంద్ర, రుద్ర రాఘవ్, రుచితా సాదినేని, మౌర్య సిద్దవరం, కంచెరపాలెం కిషోర్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. మంత్ ఆఫ్ మధు అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరిన్ని వార్తలు