మోసగాళ్లు వచ్చేది అప్పుడే!

8 Mar, 2021 02:17 IST|Sakshi

మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్ళు’. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహించారు. ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదల తేదీని ప్రకటించి, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్‌ చేయనున్నట్లు నటుడు మంచు మోహన్‌బాబు తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. ‘‘అమెరికాలో జరిగిన ఐటీ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఈ భారీ స్కామ్‌ వల్ల అక్కడి కొన్ని వేల కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి. 4వేల కోట్ల స్కామ్‌ చేసిన వారు దొరికారా? లేదా? దోచుకున్న డబ్బుని ఎక్కడ దాచిపెట్టారు? అనే కథతో చిత్రాన్ని రూపొందించాం. చిరంజీవిగారు విడుదల చేసిన ట్రైలర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రబృందం పేర్కొంది. నవదీప్, నవీన్‌ చంద్ర, వైవా హర్ష తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్‌ సి.ఎస్, షెల్డన్‌ చౌ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు