స్నేహం.. యాక్షన్‌.. థ్రిల్‌

13 Mar, 2021 02:04 IST|Sakshi

‘‘అతిపెద్ద ఐటీ స్కామ్‌ ఆధా రంగా ‘మోసగాళ్ళు’ చిత్రాన్ని రూపొందించాం. ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం. మా నాన్న (మంచు మోహన్‌బాబు) పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 19న సినిమాను విడుదల చేస్తున్నాం. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని మంచు విష్ణు అన్నారు. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్ళు’. ఇందులో విష్ణు సోదరిగా కాజల్‌ అగర్వాల్‌ నటించారు. హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ చిన్‌ దర్శకత్వం వహించారు.

బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి, నవదీప్, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన దాదాపు పది నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను శుక్రవారం వైజాగ్‌ మెలోడి థియేటర్లో ప్రేక్షకులకు చూపించారు. అనంతరం విలేకరులతో మంచు విష్ణు మాట్లాడుతూ – ‘‘విశాఖలో అభిమానులతో ఈ ప్రీమియర్‌ షో చూడడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ హైలైట్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో స్నేహం, యాక్షన్, థ్రిల్లింగ్‌ అన్నీ ఉంటాయి’’ అన్నారు. నవదీప్‌ కూడా పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు