ఆట ఇప్పుడే మొదలైంది

4 Oct, 2020 01:54 IST|Sakshi

మంచు విష్ణు హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. ఇందులో విష్ణుకి సోదరిగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను అల్లు అర్జున్‌ శనివారం విడుదల చేశారు. ఇండియాలో మొదలై అమెరికాను వణికించిన భారీ ఐటీ స్కామ్‌కి పాల్పడిన వారిని వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరిçస్తున్నట్లు టీజర్‌ మొదలవుతుంది. ‘మిమ్మల్ని కనిపెడతాం, నాశనం చేస్తాం.

దీనికి అవసరమైన చర్యలు తీసుకోవటానికి నేను రెడీగా ఉన్నాను. ప్రిపేర్‌ అయ్యాను’ అని ట్రంప్‌ అంటారు. ఈ స్కామ్‌ వెనక ఉన్న మాస్టర్‌ మైండ్స్‌ మంచు విష్ణు, కాజల్‌ అగర్వాల్‌ నోట్ల కట్టలు కుక్కిన బ్యాగుల మధ్య నిలబడి టీజర్‌లో కనిపిస్తారు. ‘ఇది సరిపోతుంది కదా’ అని కాజల్‌ అంటే, ‘ఆట ఇప్పుడే మొదలైంది’ అంటారు విష్ణు. ‘మోసగాళ్లు’ టీజర్‌ను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేశారు. ఈ చిత్రానికి దర్శకత్వం: జెఫ్రీ గీ చిన్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: విజయ్‌కుమార్‌ ఆర్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు