Most Eligible Bachelor Movie: ఓటీటీకి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’

14 Nov, 2021 12:15 IST|Sakshi

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సరైన హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ చిత్రం ఏకంగా బ్లాక్ బాస్టర్ హిట్‌ను అందించింది. అల్లు అరవింద్ సమర్సణలో ‘ గీతాఆర్ట్స్-2 ‘ బ్యానర్ పై బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే మిక్స్‌డ్ రివ్యూలను తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల వర్షం గురిపించింది.

చదవండి: బిగ్‌బాస్‌ 5: శ్రీరామ్‌ చంద్రకు సజ్జనార్‌ మద్దతు, ఏమన్నారంటే..

ఇదిలా ఉంటే ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ ఓటీటీకి వస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రీలిజ్ తేదీని మేకర్స్‌ ప్రకటించించారు.కాగా ఈ చిత్రం విడుదలైన 35 రోజుల్లోపే ఓటీటీలో విడుదల కాబోతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని ఈ నెల 19న ఆహా లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రూ. 20.91 కోట్ల బిజినెస్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసే సరికి రూ.మ23.75 కోట్ల షేర్స్‌ను సాధించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్నిఅందించాడు.

మరిన్ని వార్తలు