ప్రసాదు.. మీ పెళ్లెప్పుడు..?!

9 Sep, 2020 16:01 IST|Sakshi

(వెబ్‌ స్పెషల్‌) మన సమాజంలో ఒకప్పుడు బాల్య వివాహాలు జరిగేవి. పదేళ్లలోపు పిల్లలకు వివాహం చేసేవారు. తర్వాత కాలానుగుణంగా పెళ్లికి వయసు మారిపోతూ వస్తోంది. ఇక ప్రస్తుతం అమ్మాయిలే 30 దాటాక పెళ్లి చేసుకుంటున్నారు. సామాన్యులమే ఇలా ఉంటే ఇక సెలబ్రెటీల మాట. అవును 50 ఏళ్లు దాటిన పెళ్లి ఊసెత్తని హీరోలు ఉన్నారు మన ఇండస్ట్రీలో. ఈ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్ల మీద ఓ లుక్కేయండి..

1. సల్మాన్‌ ఖాన్‌
ఇండస్ట్రీలో పెళ్లి టాపిక్‌ వస్తే వెంటనే గుర్తుకు వచ్చేది కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌. 54 సంవత్సరాలు వచ్చిన ఈ హీరో ఇంకా పెళ్లి ఊసేత్తడం లేదు. అలా అని వివాహం మీద ఏమైనా వ్యతిరేకత ఉందా అంటే ఏం లేదు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో లవ్‌ ట్రాక్‌ నడిపాడు. మొదట ఐశ్యర్య రాయ్‌ని ప్రేమించాడు. కానీ బ్రేకప్‌ అయ్యింది. తర్వాత ఐశ్యర్య, అభిషేక్‌ని వివాహం చేసుకుంది. కొద్ది రోజులు సంగీతను ప్రేమించట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కత్రినా కైఫ్‌తో మరోసారి ప్రేమలో పడ్డాడు. కానీ ఆమె, రణ్‌బీర్‌ కపూర్‌తో లవ్‌లో పడింది. దాంతో కొద్ది రోజుల పాటు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉన్నాడు భాయిజాన్‌. ప్రస్తుతం రొమేనియన్ మోడల్ లూలియా వంతూర్‌తో ప్రేమలో పడ్డాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ చాలా సందర్భాలలో కలిసి కనిపించారు.. త్వరలో పెళ్లి చేసుకుంటారని చెబుతున్నారు. మరి ఈ సారైనా సల్మాన్‌ ప్రేమ సక్సెస్‌ అయ్యి.. పెళ్లి పీటలేక్కుతుందేమో చూడాలి. (చదవండి: ఆగేది లేదు!)

2. ప్రభాస్‌
బాహుబలితో అంతర్జాతీయ క్రేజ్‌ సంపాదించుకున్నాడు డార్లింగ్‌. ఇక ఇప్పుడు ప్రభాస్‌ పెళ్లి గురించి టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ జనాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. బాహుబలి అవ్వగానే ఓ ఇంటి వాడిని అవుతానని చెప్పిన డార్లింగ్‌ ఇప్పుడు మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. బాహుబలి తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్‌, అనుష్క ప్రేమించుకుంటున్నారని.. ప్రస్తుతం స్వీటీ పెళ్లికి సిద్ధంగా లేదని.. అందుకే డార్లింగ్‌ పెళ్లి వాయిదా వేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే గనక నిజమయ్యి.. ప్రభాస్‌, అనుష్కలు వివాహం చేసుకుంటే అభిమానులకు పండగే! చూడాలి మరి ఏం జరుగుతుందో.

3. రణ్‌దీప్‌ హుడా
బాలీవుడ్‌ హీరో రణ్‌దీప్‌ హుడా కూడా మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ లిస్ట్‌లో ఉంటాడు. 44 ఏళ్ల ఈ హీరో పెళ్లి ఊసెత్తడం లేదు. పైగా ఇంతవరకు తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే రాలేదు అంటాడు. ఇతను కూడా సుస్మితా సేన్‌, నీతూ చంద్ర వంటి హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడు. (చదవండి: వారం వారం ఆశ్చర్యం)

4. రామ్‌
హీరో రామ్‌ కూడా ఇంకా పెళ్లి ఊసెత్తడం లేదు. లాక్‌డౌన్‌ కాలంలో రామ్‌ వివాహం గురించి చర్చలు మొదలయ్యాయని టాక్‌. రామ్ వయసు ఇప్పుడు 32 ఏళ్ళు. మూడు పదుల వయసులోకి వచ్చినప్పటి నుంచే ఈ హీరోను పెళ్లి చేసుకోమ్మని ఇంట్లో వాళ్ళు పోరుతున్నారట. కానీ రామ్ మూడేళ్ళుగా కెరీర్ కారణంగా పెళ్లి వాయిదా వేస్తూ వస్తున్నాడు. మరి ఈసారి తప్పించుకుంటాడో లేదో చూడాలి.

6. ఉదయ్‌ చోప్రా
దర్శకుడు యశ్‌ చోప్రా కుమారుడు ఉదయ్‌ చోప్రా కూడా సింగిల్‌గానే ఉన్నారు. గతంలో ఈ హీరో నర్గిస్‌ ఫక్రిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని కూడా భావించాడు. కానీ ఎందుకో మరి అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఈ నటుడు సోలో జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. 

7. రణ్‌బీర్‌ కపూర్‌
బాలీవుడ్‌ లవర్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌ కూడా ఇంకా పెళ్లి పీటలేక్కలేదు. కాకపోతే ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లతో ప్రేమాయాణం నడిపాడు. తొలుత దీపిక, తర్వాత కత్రినా. అయితే వీరిద్దరూ ఇతడికి బ్రేకప్‌ చెప్పారు. ప్రస్తుతం ఈ లవర్‌ బాయ్‌ అలియా భట్‌తో రిలేషన్‌లో ఉన్నాడు. బ్రహ్మాస్త్ర సినిమా తర్వాత పెళ్లి చేసుకోవాలని భావిస్తోన్నట్లు సమాచారం.

ఇక వీరితో పాటు టాలీవుడ్‌లో వరుణ్‌ తేజ్‌, విజయ్‌ దేవరకొండ, సందీప్‌ కిషన్‌ వంటి హీరోలు సింగిల్‌గా ఉన్నారు. ఇక హీరోయిన్‌ టబు, అమిషా పటేల్‌, సుస్మితా సేన్‌, దివ్యా దత్తా సింగిల్‌గానే లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. త్వరలోనే వీరంతా ఓ ఇంటి వారు కావాలని కోరుకుందాం. (ఇదంతా నా కర్మ : బోరున ఏడ్చిన సంజన)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా