టాలీవుడ్‌లో వరుస విషాదాలు.. నాలుగు రోజుల్లోనే ముగ్గురు కన్నుమూత

30 Nov, 2021 17:05 IST|Sakshi

సాక్షి; హైదరాబాద్‌: టాలీవుడ్‌లో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో టాలీవుడ్ సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతుంది. అప్పటివరకు తమతో ఉ‍న్న తోటి నటులు, కళకారులు వివిధ కారణాలతో కన్ను మూయడం సినీ ప్రపంచాన్ని కలచివేస్తోంది. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ ఇవాళ(నవంబర్‌ 30) తుదిశ్వాస విడిచారు.

నవంబర్‌ 28న ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ ఊపిరితిత్తులు పాడవడంతో కన్నుమూశారు. అలాగే ప్రముఖ దర్శకుడు కేఎస్‌ నాగేశ్వరరావు నవంబర్‌ 27న గుండెపోటుతో తిరిగిరాని అనంతలోకాలకు తిరిగి వెళ్లిపోయారు. ఈ ఒక్క నాలుగు రోజుల్లోనే ముగ్గురు టాలీవుడ్‌ ప్రముఖులు మరణించడంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల కన్నుమూత

మరిన్ని వార్తలు