ఆకట్టుకుంటున్న ‘మౌనం’ థియేట్రికల్ ట్రైలర్!

22 Sep, 2021 14:16 IST|Sakshi

రమేశ్‌ వర్మ చేతుల మీదుగా ‘మౌనం’థియేట్రికల్ ట్రైలర్

‘మల్లెపువ్వు’ఫేమ్ మురళి, ‘బిగ్ బాస్’ ఫేమ్ భానుశ్రీ జంటగా నటించిన తాజా చిత్రం ‘మౌనం’.‘వాయిస్ ఆఫ్ సైలెన్స్’ ట్యాగ్ లైన్. లాస్ ఏంజెల్స్ టాకీస్ పతాకంపై కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిషన్ సాగర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎమ్.ఎమ్.శ్రీలేఖ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ ప్రథమార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు రమేశ్‌ వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేశ్‌ వర్మ మాట్లాడుతూ.. ‘మణిరత్నం’ మౌనరాగం తరహాలో... తన మిత్రుడు మురళి నటించిన ‘మౌనం’ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. నిర్మాతలు అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి మాట్లాడుతూ... ‘మౌనం కూడా కొన్ని సందర్భాల్లో ఎంత శక్తివంతంగా ఉంటుందో చాలా సెన్సిబిల్ గా చూపించే పారా సైకలాజికల్ థ్రిల్లర్  ‘మౌనం’. అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’అన్నారు. ఐశ్వర్య అడ్డాల, 'శివ' ఫేమ్ చిన్నా, జీవా, ధనరాజ్, శేషు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ: అనిల్, స్క్రీన్ ప్లే-ఎడిటింగ్: శివ శర్వాణి.

మరిన్ని వార్తలు