బలమెవ్వడు: 'మౌన‌మా ఓడిపో' సాంగ్‌ రిలీజ్‌

12 Aug, 2021 17:41 IST|Sakshi

`మౌన‌మా ఓడిపో.. ఓన‌మాలాట‌లోదూర‌మా చేరిపో.. చేతుల గీత‌లో`` అని ప్రేయ‌సి ప్రేమికుడి గుండెల్లోని ప్రేమ గురించి త‌పిస్తుంటే...బ‌త‌కు బ‌డి ప్రేమ‌గా బ‌డి ప‌లుకు రాసుకో నిచ్చెలి ముచ్చ‌టె దాచుకోగా.. `` అంటూ ప్రేమికుడు త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తున్నాడు. అస‌లు ప్రేమికుడు, ప్రేయ‌సి ఎవ‌రు?  వారి మ‌ధ్య ప్రేమ ఎందుకు.. ఎలా పుట్టింది?  అనే విష‌యాలు తెలియాలంటే మాత్రం `బ‌ల‌మెవ్వ‌డు` సినిమా చూడాల్సిందే అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. 

ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న బలమెవ్వడు చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు.సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు "బలమెవ్వడు" చిత్రాన్నినిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మెలోడీ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కల్యాణ చక్రవర్తి రాసిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి, సాహితి చాగంటి పాడారు. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందుతున్నఈ సినిమా రిలీజ్‌ డేట్‌ త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్‌ తెలిపారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు